Home » తాతయ్య చేతిలో నవ్వుతున్న ఈ చిన్నోడు పాన్ ఇండియా స్టార్..!!

తాతయ్య చేతిలో నవ్వుతున్న ఈ చిన్నోడు పాన్ ఇండియా స్టార్..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి కొంతమంది స్టార్ హీరో, హీరోయిన్లకు సంబంధించి చిన్ననాటి ఫోటోలు ఇతర జ్ఞాపకాలు ఎప్పుడూ నెట్టింట వైరల్ అవుతూనే ఉంటాయి. ఈ క్రమంలో మరో పాన్ ఇండియా స్టార్ హీరో , ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన నటనతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను తన వైపు తిప్పుకున్నాడు. తక్కువ సమయంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకొని తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు.

Advertisement

మాస్, యాక్షన్, లవర్ బాయ్ గా ఏ పాత్ర అయినా సరే దానిలో దూరిపోయి మెప్పించగల సత్తా కలిగిన హీరో.. పైన ఫోటోలో తన తాత చంకన ఎక్కి చిరునవ్వులు చిందిస్తున్న చిన్నోడిని మీరు గుర్తుపట్టారా.. తన తండ్రి కూడా స్టార్ హీరో.. తండ్రి నట వారసత్వాన్ని అందిపుచ్చుకొని తండ్రికే గొప్ప పేరు తీసుకువచ్చే తనయుడుగా మారుతున్నాడు. ఇంకా గుర్తుకు రాలేదా.. ఆయనే నండి మనందరి అభిమాన హీరో మెగాస్టార్ తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. చిరుత సినిమా ద్వారా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ మొదటి మూవీ తో తన టాలెంట్ ను బయట పెట్టుకున్నాడు.

ఆ తర్వాత వచ్చిన మగధీర సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకొని, ఇండస్ట్రీ చూపు మొత్తం తనవైపు తిప్పుకున్నారు. ఆ విధంగా వరుసగా సినిమాలో నటిస్తూ స్టార్ హీరోగా మారాడు. ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాలో పాన్ ఇండియా లెవెల్ లో స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు అని చెప్పవచ్చు. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో ఆర్సి 15 సినిమా చేస్తున్నట్టు తెలుస్తోంది.

also read:

Visitors Are Also Reading