Home » శాకుంతలం మూవీలో సమంతాను తీసుకోవడానికి కారణం ఆవిడే.!!

శాకుంతలం మూవీలో సమంతాను తీసుకోవడానికి కారణం ఆవిడే.!!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ దర్శకుడిగా పేరుపొందిన గుణశేఖర్ ఇప్పటికే ఎన్నో పౌరాణిక చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన చేసిన సినిమాల్లో చాలా మూవీస్ సూపర్ హిట్ అయ్యాయి.. ఈ తరుణంలోనే సమంత ముఖ్య పాత్రలో గుణశేఖర్ మరో కొత్త మూవీతో మన ముందుకు వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే.. దాని విశేషాలు ఏంటో చూద్దాం.. సమంత ప్రధాన పాత్రలో శాకుంతలం మూవీ థియేటర్లలోకి రావడానికి ఎంతో సమయం లేదు. ఈ సందర్భంలోనే ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ చేశారు మూవీ యూనిట్.

Advertisement

also read:తాతయ్య చేతిలో నవ్వుతున్న ఈ చిన్నోడు పాన్ ఇండియా స్టార్..!

ఇది విడుదలైన కొద్ది గంటల్లోనే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుందనీ చెప్పవచ్చు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న గుణశేఖర్ శాకుంతలం మూవీలో సమంతనే తీసుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన కారణాలు తెలియజేశారు అవేంటో ఇప్పుడు చూద్దాం. గుణశేఖర్ కూతురు నీలిమ విదేశాల నుండి వచ్చి నిర్మాతగా స్థిరపడాలని భావించారట. అయితే మంచి కథ కావాలని చెప్పారట. ఈ తరుణంలోనే గుణశేఖర్ శాకుంతలం సినిమాని సెలెక్ట్ చేసుకున్నారని అన్నారు. ఇది పౌరాణిక చిత్రం..

Advertisement

దీనికి సరైన నటి ఎవరా అని ఆలోచిస్తున్న తరుణంలో నీలిమ టక్కున సమంతా పేరుని చెప్పేసిందట. అయితే సమంత మోడ్రన్ హీరోయిన్ , శకుంతలగా ఆమె సెట్ అవుతుందా.. కాదా.. అని సందేహం కలిగిందట.. ఈ తరుణంలోనే ఆమె ఇదివరకు నటించిన రామలక్ష్మి పాత్ర గుణశేఖర్ గుర్తుకు వచ్చి, అచ్చం పల్లెటూరు అమ్మాయి పాత్రలో ఒదిగిపోయిన సమంత శకుంతలగా సెట్ అవుతుందని భావించారట. ఇక సమంతాను కలిసి కథ చెబుతున్న సమయంలో తనకు సమంత కనబడలేదని, శకుంతల కనిపించిందని అందుకే ఆమెను ఎంపిక చేశానంటూ గుణశేఖర్ తెలియజేశారు. మరి చూడాలి ఈ సినిమా ఎంతటి హిట్ అవుతుందో..

also read:

Visitors Are Also Reading