Home » అలనాటి స్టార్ యాక్టర్ జగ్గయ్య మనవడు కూడా వెండి తెరపై నటిస్తున్నాడనే విషయం మీకు తెలుసా ?

అలనాటి స్టార్ యాక్టర్ జగ్గయ్య మనవడు కూడా వెండి తెరపై నటిస్తున్నాడనే విషయం మీకు తెలుసా ?

by Anji
Ad

అతి పిన్న వయస్సులోనే రామాయణంలోని లవుడి పాత్రను పోషించాడు జగ్గయ్య. రంగ స్థల నటుడి నుంచి సినిమాల్లోకి ప్రవేశించాడు. 1928 డిసెంబర్ 31న గుంటూరు జిల్లా తెనాలి దగ్గర మోరంపూడి గ్రామంలో జన్మించారు. ఉన్నత చదువులు చదివిన తరువాత విలేకరీగా కొద్ది రోజులు పని చేశారు. ఆ తరువాత ఆంధ్రా రిపబ్లిక్ పత్రికకు ఎడిటర్ గా కూడా పని చేశారు. ఆకాశవాణి రేడియోలో న్యూస్ రీడర్ గా పని చేస్తున్న సమయంలో త్రిపురనేని గోపించంద్ తో పరిచయం ఏర్పడింది. 1952లో ఆయన దర్శకత్వంలో తీసిన ప్రియురాలు అనే చిత్రంలో తొలుత జగ్గయ్య నటించారు. 

Advertisement

ఆ సినిమా ఘన విజయం సాధించడంతో రేడియో న్యూస్ రీడర్ గా స్వస్తీ పలికి దాదాపు మూడు సినిమాలకు సైన్ చేశారు. అలా బి.ఎన్.రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన బంగారు పాప సినిమాలో నటించారు. ఈ చిత్రం సంచలన విజయం సాధించడంతో జగ్గయ్య పేరు మారుమ్రోగిపోయింది. ఇలా 1950 నుంచి 1970 వరకు తెలుగు సినీ పరిశ్రమకు ఎనలేని సేవ చేశాడు జగ్గయ్య. కంచు కంఠంతో స్పష్టమైన ఉచ్చరణతో సంభాషణలు పలికించే కొంగర జగ్గయ్య ఆనాటి ఎన్టీఆర్, ఏఎన్నార్ సమకాలీన నటుడిగా చెబుతుంటారు. వి.బి.రాజేంద్రప్రసాద్ నిర్మాణ సారథ్యంలో వచ్చిన చాలా సినిమాల్లో జగ్గయ్య నటించారు. సెకండ్ హీరోగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కాంతారావులతో చేసినప్పటికీ ఆ తరువాత వారి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించారు. తమిళంలో శివాజీ గణేషన్ సినిమాలు  ఎక్కువగా తెలుగులోకి డబ్ చేసేవారు. శివాజీ గణేషన్ వాయిస్ కి జగయ్య డబ్బింగ్ చెప్పేవారు. జగయ్య కంచు కంఠంతో చెప్పిన డైలాగ్ లను చూసి రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు కళావాచస్పతి అనే బిరుదు కూడా ఇచ్చింది. రెండోతరం నటులు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి నటులతో కూడా నటించారు జగయ్య.  

Advertisement

Also Read :  పవన్ కళ్యాణ్ అలీ కూతురు పెళ్లికి రాకపోవడానికి అసలు కారణం అదేనా ?

Manam News

ఇక చివరగా మోహన్ బాబు హీరోగా నటించిన డిటెక్టివ్ నారద అనే సినిమాలో నటించిన జగ్గయ్య 2004లో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన వారసులు తెలుగు సినీ పరిశ్రమలో లేరనుకునే సమయంలో ఆయన సోదరుడి మనవడైన సాత్విక్ కృష్ణ సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టాడు. శ్రీనివాస్, సుధారాణి దంపతులకు సాత్విక్ కృష్ణ జన్మించాడు. తండ్రి శ్రీనివాస్ రాజకీయ నాయకుడు, తల్లి సుధారాణి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో  ఉపాధ్యాయురాలుగా పని చేస్తుంది. 2012లో బీటెక్ పూర్తి చేశాడు సాత్విక్ కృష్ణ. చిన్నప్పటి నుంచే నాటికలు, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనేవాడు. తనకు సినిమాల్లోకి రావడం ఎంతో ఇష్టమని భావించి అర్ధనారి అనే సినిమాలో ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించాడు. ఆ తరువాత శ్రావణ సమీరాలు అనే సిరియల్ లో నటించారు. అవకాశం చిక్కినప్పుడు సినిమాలు, లేదంటే సీరియల్స్ లో నటిస్తున్నారు సాత్విక్ కృష్ణ.   

Also Read :  డైరెక్టర్ కృష్ణవంశీని భయపెట్టిన మూవీ ” ఖడ్గం”కి 20 ఏళ్లు.. డైరెక్టర్ ఎందుకు దాక్కున్నారంటే..?

Visitors Are Also Reading