ఆన్‌లైన్ షాపింగ్ అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రతి ఒక్కరూ ఏ వస్తువును అయినా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఈ తరుణంలోనే చిత్ర విచిత్ర ఘటనలతో పాటు పలు మోసాలు కూడా జరుగుతున్నాయి.
ఇవి జరుగుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. మార్కెట్‌లో మంచి పాపులర్ ఫోన్ ప్రత్యేక ఆఫర్ ప్రకటిస్తుంటాయి. ఆఫర్ ఆశపడ్డ జనాలు ఎలాగైనా ఆ మొబైల్ ఇంత తక్కువ ధరకు వస్తుండడంతో దానిని కొనుగోలు చేస్తే బాగుంటుందని అనుకుంటారు. చాలా వరకు కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతుంటారు. ఒక వేళ వారి వద్ద డబ్బులు లేకున్న ఆఫర్‌లో మొబైల్ వస్తుందని అప్పు చేసి మరీ తీసుకునే వారు కూడా ఉన్నారు. కానీ వారి వద్దకు మొబైల్ వచ్చే సరికి మాత్రం మోసం జరుగుతుంది. అది ఎక్కడ జరుగుతుందనేది తెలియడం లేదు. చాలా మంది తరుచూ ఆన్‌లైన్ మోసాలు జరుగుతున్నాయని టీవీల్లో, పేపర్లలో, వెబ్‌న్యూస్‌లో చూస్తూనే ఉన్నాం.
Advertisement
Advertisement
తాజాగా ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ కు చెందిన ఓ వ్యక్తికి మొబైల్ ఫోన్ డెలివరీ అయింది. ఓపెన్ చేసి చూస్తే అందులో ఉండే మొబైల్ ఫోన్‌కు బదులుగా రిన్ సోప్ వచ్చింది. ఈకామ్ ఎక్స్‌ప్రెస్, ఫ్లిప్‌కార్ట్ పై చర్యలు తీసుకోవాలని.. తనకు కూడా న్యాయం చేయాలని కోరారు. ఈ విషయంపై లీగల్ గా ప్రొసీడ్ అవుతానని పేర్కొన్నాడు. కేవలం ఈ ఒక్క ఘటనే కాదు.. ఇలా చాలా సందర్భాల్లో మోసాలు జరుగుతూనే ఉన్నాయి. అయినా కానీ మోసపోతూనే ఉన్నారు. ఈ మోసాలకు చెక్ పెడతారో చూడాలి.
Also Read :
మంకీపాక్స్ నివారణకు డబ్ల్యూహెచ్ఓ పంచ సూత్రాలు ఇవే..!
సితార సందడి మామూలుగా లేదుగా.. ఆమెకు ఈ టాలెంట్ కూడా ఉందా..? పలువురు కామెంట్స్