Home » చనిపోయిన వారు ఈ విధంగా కలలో కనిపిస్తే మీకు అనుకోకుండా ధనలాభం కలుగుతుందట..!

చనిపోయిన వారు ఈ విధంగా కలలో కనిపిస్తే మీకు అనుకోకుండా ధనలాభం కలుగుతుందట..!

by Sravanthi Pandrala Pandrala
Ad

సాధారణంగా ఎవరికైనా చనిపోయిన వాళ్ళ పెద్దవాళ్లు, పూర్వికులు కలలో కనిపించడం సహజమే. కానీ ఇలా కలలో కనిపిస్తే దానికి అనుగుణంగా ఒక్కొక్కరు ఒక్కో అర్థం చెబుతారు. చనిపోయిన వారికి కర్మలు సరిగ్గా చేయలేదేమో అందుకే వారు కలలో కనిపిస్తున్నారు అని ఒకరంటారు. ఇంకొందరేమో చనిపోయినవారికి మీరంటే బాగా ప్రేమ ఉండడంవల్ల కనిపిస్తున్నారు అంటారు. మరికొంతమంది ఇంకా వేరే ఏవైనా కారణాలు చెబుతారు. అయితే చనిపోయిన వారు కలలో రావడం వెనుక వేరే అర్థాలు దాగి ఉన్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

Advertisement

హిందూ సంప్రదాయంలో ఒక వర్గం వారు తమ ఆచార వ్యవహారాలకు అనుగుణంగా చనిపోయిన వ్యక్తులకు 15 రోజుల లోపు కర్మకాండలు పూర్తి చేస్తారు. అంతేకాదు నెలకోసారి మాసికం, ఏడాదికోసారి సంవత్సరికం చేసి చనిపోయిన వారిని తలుచుకుంటూ కర్మలు చేస్తే దాంతో వారి ఆశీస్సులే కాదు చనిపోయిన పూర్వీకుల ఆశీస్సులు కూడా సదరు కుటుంబాలకు కలుగుతాయట. అగ్ని పురాణం,గరుడ పురాణం, వాయు పురాణాలలో దీని గురించి రాసి ఉంది. ఈ క్రమంలో అలా కర్మలు చేసే కుటుంబాలకు అంతా మంచే జరుగుతుందట. ఎవరైనా వ్యక్తులు సహజసిద్ధంగా మరణిస్తే అలాంటి వ్యక్తులు కుటుంబాలకు చనిపోయిన వారి పూర్వీకుల ఆశీస్సులు బాగా ఉంటాయట. ఎవరికైనా కలలో పాము కనబడితే చనిపోయిన వారి పూర్వీకుల ఆశీస్సులు వారికి బలంగా ఉన్నాయని అర్థం. కర్మలు చేసే సమయంలో ఎవరికైనా అనుకోకుండా ధనం కలిసివచ్చినా,ఎప్పటినుంచో అనుకుంటున్న కార్యాలు నెరవేరినా, కొత్త వ్యాపారాలు ప్రారంభించినా అదంతా చనిపోయిన వారి పూర్వీకుల ఆశీస్సుల వల్లే జరిగిందని అర్థం చేసుకోవాలి. చనిపోయిన వారు కలలో ఆనందంగా ఆశీర్వదిస్తున్నట్టు కనిపిస్తే అప్పుడు ఆ కల వచ్చిన వారికి అంతా మంచే జరుగుతుందట. తల్లిదండ్రులను సరిగ్గా చూసుకుంటున్న వారికి చనిపోయిన పెద్దల ఆశీస్సులు పుష్కలంగా లభిస్తాయట.

ALSO READ;

ఆచార్య వీఎఫ్ఎక్స్ విష‌యంలో అంత క‌థ ఉందా..?

ప్లే ఆఫ్స్ కు వరుణుడు అడ్డుపడితే ఏం జరుగుతుంది..?

 

Visitors Are Also Reading