Home » సితార సంద‌డి మామూలుగా లేదుగా.. ఆమెకు ఈ టాలెంట్ కూడా ఉందా..? ప‌లువురు కామెంట్స్

సితార సంద‌డి మామూలుగా లేదుగా.. ఆమెకు ఈ టాలెంట్ కూడా ఉందా..? ప‌లువురు కామెంట్స్

by Anji
Ad

తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో స్టార్ కిడ్స్‌కి అస‌లు కొదవే లేదని చెప్పాలి. ఇక సూప‌ర్ స్టార్ ఫ్యామిలీలో కిడ్స్ కాదు.. వాళ్లు కూడా జూనియ‌ర్ సూప‌ర్ స్టార్లు అన్నట్టుగానే ఉంటుంది. టాలీవుడ్ సినీ ఇండ‌స్ట్రీలో సూప‌ర్ స్టార్‌గా ఓ వెలుగు వెలిగిన తండ్రి కృష్ణ లెగ‌సీని కంటిన్యూ చేస్తున్న మ‌హేష్ బాబు. అదేవిధంగా ఆయ‌న‌కు ఏమాత్రం తీసిపోనంటోంది మ‌హేష్ గారాల ప‌ట్టి సితార. తండ్రిలోని న‌ట‌న‌తో పాటు ఎక్స్‌ట్రా క్వాలిటీస్ త‌న‌కు ఉన్నాయ‌ని ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న‌ది సితార‌. స‌ర్కారు వారి పాట సినిమాలో బెన్నీ సాంగ్‌తో సిల్వ‌ర్ స్క్రీన్ పై క‌నిపించిన ఈ లిటిల్ సూప‌ర్ స్టార్ ఇప్పుడు గుర్ర‌పు స్వారీ నేర్చుకుంటోంది.

Advertisement

మహేష్‌బాబు కూతురుగానే కాకుండా సొంత ఐడెంటిటీని క్రియేట్ చేసుకునేందుకు సితార అన్నీ రంగాల్లో తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇక సోష‌ల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ అయింది. ఇటీవ‌ల ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ ఓపెన్ చేసిన సితార‌కు 8ల‌క్ష‌ల మంది ఫాలోవ‌ర్స్ ఉన్నారంటే ఇక ఏరేంజ్ ఫాలోయింగ్ ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. తాత కౌబాయ్‌, తండ్రి ట‌క్క‌రిదొంగ గా కనిపిస్తే సితార కూడా అదే స్టైల్‌లో గుర్ర‌పు స్వారీ నేర్చుకుంటోంది. సితార హార్స్ రైడ‌ర్‌లా కనిపిస్తోంది. అంతేకాదు త‌న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన సితార టిల్‌బెర్రీ, బెర్టా అనే రెండు అంద‌మైన శ‌క్తివంత‌మైన ద‌య‌క‌లిగిన గుర్రాల‌పై నాకు స్వారీ నేర్పిస్తున్న గురువుల‌కు థ్యాంక్స్ చెప్పింది.

Advertisement

ఇక త‌న హార్స్ రైడింగ్ ఎక్స్‌పీయ‌రెన్స్‌ని ఫ్యాన్స్‌తో షేర్ చేసుకునేందుకు ఈ వీడియోను అప్‌లోడ్ చేసింది. సితార టాలెంట్ గురంచి మ‌నం ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఆ మ‌ధ్య ఉగాది పండుగ సంద‌ర్భంగా ఆమె చేసిన క్లాసిక‌ల్ డ్యాన్స్ వీడియో చూసి ఎంతో మందితో ప్ర‌శంస‌లు పొందింది. అదేవిధంగా ఇటీవ‌ల విడుద‌లైన స‌ర్కారు వారి పాట సినిమాలోని బెన్నీ సాంగ్ ప్ర‌మోష‌న్ కోసం సితార అదిరిపోయే స్టెప్పులు వేసి అన్నీ వ‌ర్గాల అభిమానుల‌కు ద‌గ్గ‌ర అయింది. ప్రస్తుతం ఇలా హార్స్ రైడింగ్ చేస్తూ.. త‌న‌లోని తాత‌, తండ్రి చేసిన యాక్ష‌న్ పాత్ర‌కు షేడ్స్ ఉన్నాయ‌ని ప్రూవ్ చేసుకుంటుంది. లిటిల్ సూప‌ర్ స్టార్ సితార షేర్ చేసిన వీడియోలో అన్న గౌత‌మ్ కూడా ఉన్నాడు. గౌత‌మ్ కూడా తండ్రి మ‌హేష్‌ వ‌న్ నేనొక్క‌డినే సిల్వ‌ర్ స్క్రీన్‌పై క‌నిపించాడు.

Also Read: 

తారకరత్న ఎన్టీఆర్ కు పోటీ గా వచ్చాడా…?

చైతన్య కోసం సమంత ఇంత పెద్ద త్యాగం చేసిందా..?

 

Visitors Are Also Reading