Home » నరేష్ పవిత్ర లోకేశ్ వ్యక్తి గత జీవితాల ఆధారంగా సినిమా.. దర్శకుడు ఎవరంటే.?

నరేష్ పవిత్ర లోకేశ్ వ్యక్తి గత జీవితాల ఆధారంగా సినిమా.. దర్శకుడు ఎవరంటే.?

by Anji
Ad

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు, హీరోయిన్ల గురించి ప్రత్యేకంగా అందరూ మాట్లాడుకుంటారు. వారి మీదనే ఎక్కువగా ట్రోల్స్ చేస్తుంటారు. ఇక క్యారెక్టర్ ఆర్టిస్టుల గురించి ట్రోల్స్ రావడం, గాసిప్స్ రావడం ఇదే మొదటిసారి. వాళ్లు ఎవరో ఇప్పటికే అర్థమై ఉంటుంది. వారెవ్వరో కాదండోయ్.. నరేష్, పవిత్ర లోకేశ్ జంట. ప్రస్తుతం వారికి ఉన్న క్రేజ్ మరెవ్వరికీ లేదు. వారి గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చ జరుగుతుంది. 

Advertisement

ఇటీవల కృష్ణ చనిపోయినప్పుడు కూడా అందరి దృష్టి వీరి మీదనే ఉంది. వీరు కలిసి అక్కడే ఉండడం, అక్కడికి వచ్చిన వారికి పవిత్రను నరేష్ పరిచయం చేయడం వీడియోల్లో అందరూ చూశారు. ఇప్పటికే మూడు పెళ్లిల్లు చేసుకున్న నరేష్.. పవిత్రతో చాలా ఏళ్ల నుంచి రిలేషన్ లో ఉన్నాడు. ఆ తరువాత వీరిద్దరూ సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారనే వార్తలు కూడా వినిపించాయి. వీరిద్దరినీ మైసూర్ లో రెడ్ హ్యాండెడ్ గా నరేష్ మూడో భార్య రమ్య పట్టుకుంది. మేము విడిపోయి చాలా ఏళ్లు అయిందని.. నరేష్ రమ్య గురించి చెప్పుకొచ్చాడు. తాము కలిసి ఉండడం లేదని చెప్పుకొచ్చాడు. 

Advertisement

Also Read :  ఆ సినిమాల్లో నటిస్తే వరలక్ష్మీ శరత్ కుమార్ స్టార్ హీరోయిన్ అయ్యేవారా ?

Pavithra Lokesh

పవిత్రతో తనకు ఉన్న రిలేషన్ గురించి మాత్రం ఇప్పటివరకు నరేష్ అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఇప్పటికీ ఇద్దరూ కలిసే ఉంటున్నట్టు తెలుస్తోంది. ఇటీవల కమెడీయన్ అలీ నిర్మించిన అందరూ బాగుండాలి. అందులో నేను ఉండాలి అనే సినిమాలో నరేష్, పవిత్ర ఇద్దరూ జంటగా నటించారు. వీరి వ్యక్తిగత జీవితం మీద సినిమా రాబోతోందట. ఎవరు తెరకెక్కిస్తారనేది తెలియదు. వీరి వ్యక్తి గత జీవితంపై వచ్చే సినిమాలో నటించేది కూడా వీరేనట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడునున్నట్టు తెలుస్తోంది. 

Also Read :  నాగ‌శౌర్య భార్య బ్యాగ్రౌండ్ తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే..ఆ రంగంలో ప్రపంచంలోనే టాప్ పొజిష‌న్ లో..!

Visitors Are Also Reading