Home » నాగ‌శౌర్య భార్య బ్యాగ్రౌండ్ తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే..ఆ రంగంలో ప్రపంచంలోనే టాప్ పొజిష‌న్ లో..!

నాగ‌శౌర్య భార్య బ్యాగ్రౌండ్ తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే..ఆ రంగంలో ప్రపంచంలోనే టాప్ పొజిష‌న్ లో..!

by AJAY
Ad

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య వివాహం ఘనంగా జరిగింది. బెంగళూరులోని ఫైవ్ స్టార్ హోటల్లో నాగశౌర్య తాను ప్రేమించిన అనూష శెట్టి మెడలో మూడు ముల్లు వేశాడు. ఈ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. టాలీవుడ్ ప్రముఖులు సోష‌ల్ మీడియా ద్వారా నూతన వధూవరులకు అభినందనలు తెలుపుతున్నారు. శనివారం రాత్రి ప్రీ వెడ్డింగ్ కార్యక్రమంలో దంపతులు సంద‌డి చేసిన ఫోటోలు సైతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

Advertisement

ఇదిలా ఉండగా నాగ శౌర్య వివాహం చేసుకున్న అనూష శెట్టి బ్యాగ్రౌండ్ తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే. క‌ర్నాట‌క‌లో జ‌న్మించిన అనూష శెట్టి ఇంటీరియ‌ర్ డిజైన‌ర్ గా ఎంతో పేరు సంపాదించుకున్నారు. ప్ర‌పంచంలోనే 40 మంది టాప్ ఇంటీరియ‌ర్ డిజైన‌ర్ ల‌లో అనూష శెట్టి కూడా ఒక‌రు. 2019లో డిజైన‌ర్ ఆఫ్ ది ఇయ‌ర్ అవార్డును ఈ కంపెనీ సొంతం చేసుకుంది.

Advertisement

మ‌న దేశంలోనే టాప్ 10 ఇంటీరియ‌ర్ డిజైన‌ర్స్ లో అనూష శెట్టి కూడా ఉన్నారు. ఇక నాగ‌శౌర్య అనూష ప్రేమ‌లో ప‌డిన త‌ర‌వాత‌ ఈ విషయాన్ని కుటుంబంలోని పెద్దలకు చెప్పగా వారు సైతం పెళ్లికి ఓకే అన్నారు. దాంతో అందరి సమక్షంలో నేడు నాగశౌర్య అనూష శెట్టి ఒకటయ్యారు. నాగశౌర్య సినిమాల విష‌యానికి వ‌స్తే…ఊహ‌లు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ లో హీరోగా పరిచయమయ్యారు.

ఆ తరవాత ఛ‌లో సినిమాతో నాగశౌర్య సూపర్ హిట్ అందుకున్నారు. అప్పటినుండి వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. కేవలం ఒకేరకమైన పాత్రల‌లో నటించకుండా అన్ని రకాల పాత్రల‌లో నటిస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నారు. తనదైన అందంతో నాగశౌర్య టాలీవుడ్ లో లవర్ బాయ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇక పెళ్లి తర్వాత ఈ హీరో సినిమా లైఫ్ ఏ విధంగా ఉంటుందో చూడాలి.

Visitors Are Also Reading