Telugu News » Blog » ఆ సినిమాల్లో నటిస్తే వరలక్ష్మీ శరత్ కుమార్ స్టార్ హీరోయిన్ అయ్యేవారా ?

ఆ సినిమాల్లో నటిస్తే వరలక్ష్మీ శరత్ కుమార్ స్టార్ హీరోయిన్ అయ్యేవారా ?

by Anji
Ads

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ హీరోయిన్ లలో వరలక్ష్మీ శరత్ కుమార్ ఒకరు. భారీ బడ్జెట్ సినిమాలలో కీలక పాత్రల్లో నటిస్తున్న వరలక్ష్మీ శరత్ కుమార్ ఆ సినిమాలతో సక్సెస్ ని సొంతం చేసుకోవడతో పాటు నటీగా తన రేంజ్ ని పెంచుకుంటూ ప్రేక్షకులకు దగ్గర అవుతున్నారు. యశోద సినిమాతో మరో సక్సెస్ ని అందుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ..  శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన బాయ్స్, ప్రేమిస్తే సినిమాల్లో హీరోయిన్ గా అవకాశం వచ్చినప్పటికీ తండ్రి శరత్ కుమార్ ఒప్పుకోకపోవడంతో ఆ సినిమాల్లో నటించలేదని చెప్పుకొచ్చింది. 

Advertisement

పని అంటే చాలా పిచ్చి అని, పని ప్రారంభిస్తే పూర్తయ్యే వరకు నిద్రపోను అని ఆమె చెప్పుకొచ్చింది. నటన కూడా అదేవిధంగా భావిస్తున్నట్టు తెలిపింది వరలక్ష్మి శరత్ కుమార్. ప్రస్తుతం సినిమానే ప్రపంచం అని, మంచి నటిని అనిపించుకోవాలని భావిస్తున్నట్టు పేర్కొంది. ముఖ్యంగా తాను సినిమాల్లోకి రావడం నాన్నకి ఏ మాత్రం ఇష్టం లేదని, జయమ్మ తరహా పాత్రలకు నేనే ఆప్షన్ అని వర్మలక్ష్మి తెలిపింది. 

Advertisement

Also Read :  బాలయ్య హీరో అంటే నవ్వుకున్నా.. మాజీ సీఎం కామెంట్స్..!

దర్శకుడు బాల గురువు అని, బాల దర్శకత్వంలో నటిస్తున్న సమయంలో కాలర్ బోన్ విరిగిందని వెల్లడించింది. తాజాగా నందమూరి బాలయ్య నటించే వీరసింహారెడ్డి సినిమాలో దాదాపు ఐదు పేజీల డైలాగ్ ని సింగిల్ టేక్ లో చెప్పడం మెమొరబుల్ అని వివరించింది. ముఖ్యంగా డైలాగ్ చెప్పడంతో బాలయ్యతో సహా చిత్ర యూనిట్ అంతా చప్పట్లు కొట్టింది. కాస్టింగ్ కౌచ్ ని ఎదుర్కొనే అమ్మాయిలకు మాత్రమే ఆ బాద తెలుస్తుందని వరలక్ష్మీ శరత్ కుమార్ పేర్కొంది. 

Advertisement

Also Read :  నాగ‌శౌర్య భార్య బ్యాగ్రౌండ్ తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే..ఆ రంగంలో ప్రపంచంలోనే టాప్ పొజిష‌న్ లో..!