Home » ఆదిపురుష్ మూవీ టాక్.. ఇక ఆ సీన్స్ కి విజిల్సే..!

ఆదిపురుష్ మూవీ టాక్.. ఇక ఆ సీన్స్ కి విజిల్సే..!

by Anji
Ad

బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా అందరినీ తనవైపునకు తిప్పకున్నాడు హీరో ప్రభాస్. బాహుబలి సిరీస్ తరువాత సాహో, రాధేశ్యామ్ సినిమాలు వచ్చినప్పటికీ అవి ప్రేక్షకులగా అంతగా మెప్పింలేకపోయాయి. కానీ తాజాగా మరో భారీ ఎఫిక్ మూవీత ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే భారీ అంచనాలు ఉన్న ఈ మూవీ కోసం అందరూ ఎంతగానో ఎదురుచూశారు.  ఇప్పటికే ట్రైలర్, సాంగ్స్ ని బట్టి ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. 

Advertisement

 

ఇక విడుదలైన ఫైనల్ ఆదిపురుష్ ట్రైలర్ అభిమానులందరి ప్రశంసలు అందుకుంటోందనడంలో ఎలాంటి సందేహం లేదు. ట్రైలర్ లో ప్రభాస్ గ్రాఫిక్స్, డైలాగ్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ట్రోల్స్ చేసిన వారే ఈ మూవీని ప్రమోట్ చేయడం విశేషం. ఈ చిత్రం యొక్క ట్రైలర్ చూసిన తరువాత వస్తున్న రెస్పాన్స్ చూసి ప్రభాస్ అభిమానులు చాలా హ్యాపీగా ఉన్నారు. తమ హీరో అచ్చం శ్రీరామచంద్రుడిలా ఈ తరానికి సరిగ్గా సరిపోయారని సంతోషిస్తున్నారు. ఒక రకంగా శ్రీరామ చంద్రుడు అంటే ఆ దేవుడికి సంబంధించిన సినిమాలంటే.. తెలుగు ప్రేక్షకులకు నందమూరి వంశం హీరోలే ఎక్కువగా గుర్తుకొస్తారు. ఈసారి మాత్రం ప్రభాస్ ఆ పాత్రలో నటించడం చాలా ఆసక్తికరంగా మారింది.

Advertisement

గతంలో ఎన్టీఆర్ నటించిన లవకుశ మూవీని ఇప్పటివరకు ఎవ్వరూ మరిచిపోలేరు. ఆ రోజుల్లోనే శ్రీరాములు, శ్రీకృష్ణుడు అంటే ఎన్టీఆర్ అనే ఊహించుకుంటారు. పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక ఇప్పటివరకు వచ్చిన చాలా రివ్యూ రిపోర్ట్స్ పాజిటివ్ గానే వస్తున్నాయి. కొన్ని ఫైటింగ్స్ సీన్స్ చాలా బాగున్నాయని.. ప్రేక్షకులు విజిల్స్ వేస్తారని టాక్ వినిపిస్తోంది. ఆదిపురుష్ కథ కాకుండా మిగతా ఎలిమెంట్స్ పై ఎక్కువగా ఫోకస్ ఉండటంతో సినిమా ఎలా ఉంటుందో అనే అంచనాకు వస్తున్నారు. ఈ సినిమా కనుక బాహుబలి రేంజ్ లో ప్రేక్షకులకు నచ్చితే బాక్సాఫీస్ వద్ద భారీగానే ప్రభాస్ తన రేంజ్ ని మరోసారి ప్రదర్శించే అవకాశముంది. ప్రభాస్ రేంజ్ వేరే లెవల్ అని తప్పకుండా బాహుబలి రికార్డులను కొట్టడం ఖాయం అంటున్నారు. ఈ మూవీ ఎన్ని బ్లాక్ బస్టర్స్ రికార్డులను తిరగరాస్తుందో వేచి చూడాలి మరి. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 జల్సా మూవీలో సరిహద్దు రాయికి కత్తికి ఉన్న లింక్ గురించి మీకు తెలుసా ? 

కొడాలి నాని, ఎన్టీఆర్ మధ్య గ్యాప్ ఎందుకు వచ్చిందో తెలుసా?

బాలయ్య కూతురిగా కృతి శెట్టి… షాక్ లో ఫ్యాన్స్ ?

Visitors Are Also Reading