Telugu News » ఈ గుడ్డు స్పెష‌ల్‌.. వ‌ర‌ల్డ్ రికార్డు..!

ఈ గుడ్డు స్పెష‌ల్‌.. వ‌ర‌ల్డ్ రికార్డు..!

by Anji

సోష‌ల్ మీడియా అంటేనే ఒక మాయ ప్ర‌పంచం అని చెప్ప‌వ‌చ్చు. ఇక్క‌డ ఎప్పుడు ఎవ‌రు హైలెట్ అవుతారో.. ఎవ‌రిపై విమ‌ర్శ‌లు పెరుగుతాయో చెప్ప‌లేము. అంతెందుకు పెద్ద పెద్ద దేశాల‌లోని ప్ర‌భుత్వాల‌ను కుప్ప‌కూల్చేసింది అంత ప‌వ‌ర్‌పుల్ వేదిక సోష‌ల్ మీడియా. సామాజిక మాద్య‌మానికి ఉన్న బ‌లం మామూలు కాదు. ఇక్క‌డ ఎవ్వ‌రికీ న‌చ్చింది వారు ఇక్క‌డ పోస్ట్ చేసుకోవ‌డానికి అవ‌కాశ‌ముంటుంది.

Ads

World Record: ముద్దుగుమ్మ రికార్డులు బద్దలు.. 50 మిలియన్లకు పైగా లైక్‌లు.. అదే ఈ 'గుడ్డు' స్పెషల్..

ఇంట‌ర్‌నెట్ ప్ర‌పంచంలో వ్య‌క్తులు త‌మ భావాల‌ను ఫొటోలు, వీడియోలు, మీమ్స్ రూపంలో వ్య‌క్త‌ప‌రుస్తుంటారు. అవి చూసిన వారు వాటిని లైక్ చేస్తూ ఉన్నారు. అంతేకాదు కామెంట్స్ కూడా జోడిస్తుంటారు. ఇలా కొన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా వైర‌ల్ అవుతుంటాయి. ఇలాంటి కోవ‌లోకి వ‌చ్చే ఒక అంశ‌మే ఒక‌టి తెగ వైర‌ల‌వుతుంది. ఓ ముద్దుగుమ్మ రికార్డుల‌ను సృష్టించింది. అదేమిటంటే ఒక ఫొటో.. అది చూస్తే మీకు కూడా ఆశ్చ‌ర్య‌పోతారు. తాజాగా ఇన్‌స్టా గ్రామ్‌లో ఆ ఫొటో చాలా వేగంగా వైర‌లవుతోంది. ఈ చిత్రంలో ఒకే ఒక్క గుడ్డు మాత్ర‌మే ఉంటంది. ఇది ప్ర‌స్తుతం గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డుల్లో కూడా చోటు ద‌క్కించుకుంది. ఈ మేర‌కు గిన్నిస్‌ వ‌ర‌ల్డ్ రికార్డుల‌ను త‌మ ట్వీట్ ద్వారా స‌మాచారం ఇచ్చారు. ఒక గుడ్డు ఫొటో ఇలా రికార్డు సృష్టించ‌డం ఇదే తొలిసారి కావడం విశేషం.


You may also like