Telugu News » Blog » చిన్నారికి నాలుగు చేతులు, నాలుగు కాళ్లు.. సోనూసూద్ సాయం

చిన్నారికి నాలుగు చేతులు, నాలుగు కాళ్లు.. సోనూసూద్ సాయం

by Anji
Ads

క‌వ‌ల పిల్ల‌ల‌లో చాలా ర‌కాలు ఉంటారు. మ‌నం త‌రుచూ చూస్తే ఉంటున్నాం. కొంత మంది మ‌గ లేదా ఆడ‌, కొంత మంది ఇద్ద‌రు మ‌గ‌, కొంత మంది ఆడ మ‌రియు మ‌గ ఇలా ర‌క‌ర‌కాలుగా క‌వ‌ల‌లు జ‌న్మిస్తుంటారు. ఇప్ప‌టి వ‌ర‌కు అవిభ‌క్త క‌వ‌ల‌లు జ‌న్మించిన వారిని చూశాం.

చాలా మంది పిల్ల‌లు జ‌న్యులోపం కార‌ణంగా లేదా మ‌రే ఇత‌ర కార‌ణం వ‌ల్ల‌నో శ‌రీరంలో ఏదో ఒక అవ‌య‌వం కానీ లేదా న‌డుం భాగం నుంచి అత‌క్కుని పుట్టిన వారిని చూసాం. కానీ ఇక్క‌డ ఓ అమ్మాయి మాత్రం చాలా విచిత్రముగా జ‌న్మించింది. ఈ చిన్నారికి ఏకంగా నాలుగు కాళ్లు.. నాలుగు చేతుల‌తో జ‌న్మించింది.

బిహార్ లోని నెవాడా జిల్లాకు చెందిన రెండున్న‌రేళ్ల ఈ చిన్నారి నాలుగు కాళ్లు, నాలుగు చేతుల‌తో జ‌న్మించింది. ఈ చిన్నారి కుటుంబం వైద్యం చేయించే స్థోమ‌త‌లేని పేద కుటుంబం కావ‌డం విశేషం. అయితే ఆ చిన్నారికి చేతులు కాళ్లు ఆమె పొట్ట‌భాగానికి అనుసంధాన‌మై ఉన్నాయ‌ట‌. ఈ మేర‌కు ఈ చిన్నారికి సంబంధించిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. దీంతో బాలీవుడ్ ప్ర‌ముఖ న‌టుడు సోనుసూద్ ఆ చిన్నారికి సాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఆ చిన్నారికి వైద్యం అందుతున్న ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డ‌మే కాకుండా ఆ చిన్నారి త్వ‌ర‌గా న‌యం అవ్వాల‌ని ప్రార్థించండ‌ని ట్వీట్ కూడా చేసారు సోనూసూద్.

Also Read : 

చైనాలో భారీ భూకంపం..సోష‌ల్ మీడియాలో వీడియో వైర‌ల్‌..!

ఎన్టీఆర్ తార‌క‌ర‌త్న మ‌ధ్య గొడ‌వ‌లేంటి..? అస‌లేం జ‌రిగిందో తెలుసా..!


You may also like