ఫిఫా ప్రపంచ కప్ మ్యాచ్ లకు ఎంతటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ జరిగిన గ్రూప్ సి మ్యాచ్ లో ఫస్ట్ గోల్ అర్జెంటీనా చేసింది. ఖతార్ లో జరిగిన ఫిఫా ఫుట్ బాల్ వరల్డ్ కప్ లో పెద్ద సంచలనమే చోటు చేసుకుంది. ప్రపంచ నెంబర్ 3 జట్టు అయినటువంటి అర్జెంటీనాను ఆసియా పసికూన సౌదీ అరేబియా 51వ ర్యాంకులో ఉన్న జట్టు ఓడించింది. ఆటలో ర్యాంకులతో సంబంధం లేదు. ఆడడమే అని రుజువు చేసింది. అంతేకాదు.. వరుసగా 36 మ్యాచ్ లలో గెలిచి వరల్డ్ కప్ లో అడుగుపెట్టిన అర్జెంటీనా జైత్ర యాత్రకి సౌదీ అరేబియా అడ్డుకట్ట వేసింది.
Advertisement
ప్రత్యర్థి జట్టులో లయొనెల్ మెస్సీ వంటి దిగ్గజ స్ట్రయికర్ ఉన్నప్పటికీ సౌదీ ఆటగాళ్లు వెనక్కి తగ్గకుండా తమ శక్తికి మించిన అద్భుతమైన ప్రదర్శన చేశారు. మ్యాచ్ 10వ నిమిషంలో మెస్సి తొలి గోల్ చేశారు. దీంతో అర్జెంటీనా జట్టు 1-0 తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే 48వ నిమిషంలో సలేహ్ అల్ షెహ్రీ చేసిన గోల్ సౌదీ 1-1 తో స్కోరు సమానం చేసింది.
Advertisement
Also Read : హైదరాబాద్‌కు చెందిన సోహ్రాబ్ మీర్జాతో సానియా మీర్జా నిశ్చితార్థం జరిగిన విషయం మీకు తెలుసా ?
ఆ తరువాత 5 నిమిషాలకే సలెమ్ అల్ దవ్సారీ చేసిన గోల్ తో సౌదీ అరేబియా ఆధిక్యంలోకి వెళ్లింది. స్కోరు సమం చేసేందుకు అర్జెంటీనా ఆటగాళ్లు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు. అర్జెంటీనా ఫార్వార్డ్ ల దాడులను సౌదీ అరేబియా గోల్ కీపర్, డిఫెండర్లు సమర్థవంతంగా అడ్డుకున్నారు. దీంతో మెస్సీ సేనకి భంగపాటు తప్పలేదు. మొత్తానికి తమ కంటే ఎన్నో రెట్లు బలమైన అర్జెంటీనాని సౌదీ అరేబియా 2-1 తేడాతో ఓడించింది. దీంతో సౌదీ అరేబియా ఓ రికార్డు నమోదు చేసిందనే చెప్పవచ్చు.
Also Read : ఫిఫా ప్రపంచ కప్.. కోహ్లీతో సహా అందరి కళ్లు ఆ ఫోటో పైనే..!