Home » ఫిఫా ప్రపంచ కప్.. కోహ్లీతో సహా అందరి కళ్లు ఆ ఫోటో పైనే..!

ఫిఫా ప్రపంచ కప్.. కోహ్లీతో సహా అందరి కళ్లు ఆ ఫోటో పైనే..!

by Anji

సాధారణంగా ఫిఫా పుట్ బాల్ ప్రపంచ కప్ కి ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తాజాగా ఫిఫా ఫుట్ బాల్ ప్రపంచ కప్ మ్యాచ్ ప్రారంభమైంది. తమ అభిమాన ఆటగాళ్లు ఎలా ఆడతారని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. క్రికెట్ కంటే కూడా ఫుట్ బాల్ ప్రపంచ కప్ లోనే పోటీ ఎక్కువ. క్రికెట్ లో వరల్డ్ కప్ అని పిలుస్తాం. కానీ ఫిఫా వరల్డ్ కప్ అని అంటారు. కేవలం ఫుట్ బాల్ లో మాత్రమే ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్స్ అని పిలుస్తుంటారు. దీనిని బట్టే దీనికి ఎంత ప్రత్యేకత ఉంటుందో అర్థమవుతోంది. 

సాధారణంగా ఏ ఆటలోనైనా ఇద్దరూ సమకాలిన అత్యత్తుమ ఆటగాళ్లు ఉంటారు. ఉదాహరణకి క్రికెట్ లో బ్రియాన్ లారా- సచిన్ టెండూల్కర్, టెన్నిస్ లో అయితే రోజర్ ఫెదరర్- రఫెల్ నాదల్ ఇలా ప్రతీ ఆటలో కూడా దిగ్గజ ఆటగాళ్లు ఉంటారు. ఫుట్ బాల్ లో మాత్రం పోర్చుగల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో.. అర్జెంటీనా మెరుపు వీరుడు లయోనల్ మెస్సీ. వీరిద్ధరూ మైదానంలో తలపడ్డారంటే ఇక ఆ మజానే వేరు. ఈ సారి వీరు తలపడ్డారు. కానీ ఫుట్ బాల్ మైదానంలో కాదు.. ఈ ప్రపంచ కప్ లో అందరి కన్నూ వీరిద్దరిపై ఉంది.బహుశా ఇదే వీరికి చివరి ప్రపంచ కప్ కావచ్చు కూడా. ఇప్పటివరకు తమ జట్టుకు ప్రపంచ కప్ అందించలేకపోయిన మెస్సీ ఓ సారి మాత్రం ఫైనల్ కి చేర్చగలిగాడు. రొనాల్డో మాత్రం ఆ పని కూడా చేయలేకపోయాడు. ఈ సారి వీరిద్దరి గురించి పెద్ద చర్చ సాగుతోంది.

Also Read :  రిషబ్ పంత్ స్థానంలో ఆరంగేట్రం చేయనున్న టీమిండియా స్టార్ ఓపెనర్ ?

Fifa World Cup

ఇక వీరిద్దరూ ప్రత్యర్థులుగా తలపడితే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులకు పెద్ద పండుగే. వీరి జట్ల మధ్య ఫైనల్ పోరు ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ స్టార్ ప్లేయర్లు ఇద్దరూ కలిసి చదరంగం ఆడడం ప్రపంచ అభిమానుల దృష్టిని ఆకర్షించింది. సాధారణంగా మెస్సీ, రొనాల్డో వీరు మైదానంలో తలపడడమే కానీ బయట ఎక్కడ కనిపించలేదు. ప్రత్యర్థులుగా వీరిద్దరూ తలపడడాన్ని చూసి.. నిజంగానే ప్రత్యర్థులు అనుకుంటారు. ఫిఫా ప్రపంచ కప్ నేపథ్యంలో ఓ ప్రచార కార్యక్రమంలో భాగంగా వీరిద్దరూ చెస్ ఆడారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  క్రికెట్ కింగ్ కోహ్లీ కూడా ఆ ఫోటోపై స్పందించకుండా ఉండలేకపోయాడు. రొనాల్డొ ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటో చూసి ఎంత అద్బుతమైన చిత్రమో అంటూ కామెంట్ చేశాడు. టీ20 ప్రపంచ కప్ తరువాత కోహ్లీ ప్రస్తుతం ఆట నుంచి కాస్త విరామం తీసుకుంటున్న విషయం తెలిసిందే. 

Also Read :  టీ 20 లకు ద్రవిడ్ కోచ్ ఎందుకు ? సెహ్వాగ్ ని తీసుకోవచ్చుగా..!

Visitors Are Also Reading