Home » హైదరాబాద్‌కు చెందిన సోహ్రాబ్ మీర్జాతో సానియా మీర్జా నిశ్చితార్థం జరిగిన విషయం మీకు తెలుసా ?

హైదరాబాద్‌కు చెందిన సోహ్రాబ్ మీర్జాతో సానియా మీర్జా నిశ్చితార్థం జరిగిన విషయం మీకు తెలుసా ?

by Anji
Ad

సానియా మీర్జా-షోయబ్ మాలిక్ విడాకులు తీసుకుంటున్నారని గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా పాకిస్తాన్ మోడల్ అయేషా ఒమర్ తో షోయబ్ డేటింగ్ చేస్తున్నాడనే విషయం సానియాకి తెలవడంతోనే వారు విడాకులు తీసుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో మొన్న నవంబర్ 15న సానియా మీర్జా 36వ పుట్టిన రోజు సందర్భంగా షోయబ్ పుట్టిన రోజు శుభకాంక్షలు తెలిపారు. అదేవిధంగా వారిద్దరూ జంటగా ఉన్న ఒక ఫోటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. 

Also Read :  టీటీ 20 లకు ద్రవిడ్ కోచ్ ఎందుకు ? సెహ్వాగ్ ని తీసుకోవచ్చుగా..! 

Advertisement

మరోవైపు సానియా మీర్జా తన చిన్ననాటి స్నేహితుడు మహ్మద్ సోహ్రాబ్ మీర్జాతో నిశ్చితార్థం జరిగిన తరువాత పెళ్లిని రద్దు చేసుకుంది. ఈ విషయం చాలా తక్కువ మందికే మాత్రమే తెలుసు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. షోయబ్ మాలిక్ కంటే ముందే టెన్నిస్ స్టార్ హైదరాబాద్ లోని ప్రముఖ బేకరీ చైన్ యూనివరల్ బేకర్స్ యజమాని సోహ్రబ్ మీర్జాతో నిశ్చితార్థం చేసుకున్నారు. జులై 2009లో వీరు ఉంగరాలు కూడా మార్చుకున్నారు. సానియా, సోహ్రాబ్ లు ఏడడుగులు నడవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అసలు ఏమైందో ఏమో తెలియదు కానీ నిశ్చితార్థం జరిగిన 6 నెలలకే ఈ జంట విడిపోయినట్టు సమాచారం. 

Also Read :  కృష్ణ ఆసుపత్రిలో ఉన్నప్పుడు వైద్యులు కుటుంబ సభ్యులకు చెప్పిన ఆసక్తికరమైన విషయాలు ఇవే..!

Manam News

సానియాను సోహ్రబ్ హైదరాబాద్ లోని సెయింట్ మేరీస్ కళాశాలలో కలిశాడు. ఆమె అక్కడ చదువుకునే రోజుల్లో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. అదే కాలేజీలో కామర్స్ చదివాడు. ఆ తరువాత యూకే లో ఎంబీఏ చదివాడు.  ప్రస్తుతం సానియా-షోయబ్ మాలిక్ విడాకులు  తీసుకున్నారనే వార్త చక్కర్లు కొడుతున్న సమయంలోనే సానియా-సోహ్రబ్ నిశ్చితార్థం గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ కొనసాగుతోంది. ఇదిలా ఉండగా.. సానియా-షోయబ్ విడాకులు అని ఊహగానాల మధ్య ఓ వార్త ఆశ్యర్యానికి గురి చేస్తోంది. త్వరలో వీరిద్దరూ కలిసి పాకిస్తాన్ టీవీలో టాక్ షో నిర్వహిస్తారని ఓ ఓటీటీ ప్లాట్ ఫాం ప్రకటించింది. ఇక ఈ షోకి మీర్జా మాలిక్ షో అనే పేరు కూడా పెట్టారు. అందుకు సంబంధించిన ఓ పోస్టర్ కూడా సోషల్ మీడియాలో కనిపిస్తోంది. 

Visitors Are Also Reading