Home » ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి రోహిత్ ను తప్పించింది అందుకేనా..? అసలు విషయం వెల్లడించిన హెడ్ కోచ్..!

ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి రోహిత్ ను తప్పించింది అందుకేనా..? అసలు విషయం వెల్లడించిన హెడ్ కోచ్..!

by Anji
Ad

ఐపీఎల్ 2024 టోర్నీకి మరికొద్ది రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ టోర్నీ కోసం 10 టీమ్ సిద్దమవుతున్నాయి. ఇక మినీ వేలంలో కోట్లాది రూపాయలు వెచ్చించి ఆటగాళ్లను తీసుకున్నారు. ముంబై ఇండియన్స్ ట్రేడ్ విండో ద్వారా జట్టు బాధ్యతలను హార్దిక్ పాండ్యాకు అప్పగించింది. రోహిత్ శర్మను సారథ్యం నుంచి తొలగించడంతో అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. తాజాగా ఇదే విషయం పై నోరు విప్పాడు. ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మార్క్ బౌచర్.

Advertisement

ముంబై కెప్టెన్సీ బాధ్యతలను హార్దిక్ పాండ్యాకి అప్పగించడానికి గల అసలు కారణాన్ని వెల్లడించారు బౌచర్. ఇది జట్టు భవిష్యత్ ప్రణాళికల్లో భాగంగా తీసుకున్న నిర్ణయమని చెప్పాడు. దేశంలో చాలా మందికి ఇది అర్థం కాలేదు. ప్రజలు చాలా ఎమోషనల్ గా తీసుకున్నారు. కానీ కొన్నిసార్లు భావోద్వేగాలను దూరంగా ఉంచడం చాలా అవసరం. ఇది క్రికెట్ కి సంబంధించిన నిర్ణయం మాత్రమేనని భావిస్తున్నట్టు తెలిపాడు. మైదానంలో అని బ్యాటింగ్ ని ఆస్వాదిస్తూ.. మంచి పరుగులు చేయనివ్వండి అంటూ ప్రధాన కోచ్ మార్క్ బౌచర్ పేర్కొన్నాడు.

Advertisement

రోహిత్ శర్మది చాలా మంచి వ్యక్తిత్వం. గత కొద్ది సంవత్సరాలుగా కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. టీమిండియాకి కూడా అతడే కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. గత కొన్ని సీజన్లలో రోహిత్ పెద్దగా పరుగులు చేయలేదు. కెప్టెన్ గా మాత్రం అమోఘంగా రాణిస్తున్నాడు. టీమిండియా కెప్టెన్ గా అతనిపై భారీ బాధ్యతలున్నాయి. ఐపీఎల్ లో ఆడే సమయంలో రోహిత్ భుజాలపై ఈ బాధ్యత ఉండకూడదని అనుకున్నాం. ఈ నిర్ణయంతో రోహిత్ శర్మ అత్యుత్తమ ఆటను చూసే అవకాశం మీకు లభిస్తుంది. ముంబై ఇండియన్స్ తో హ్యాపీగా ఆడుతున్నాడని చూడాలనుకుంటున్నట్టు చెప్పుకొచ్చాడు మార్క్ బౌచర్.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ వీక్షించండి !

Visitors Are Also Reading