Telugu News » Blog » టెంపర్ సినిమాలో పోసాని పాత్రలో ముందుగా అనుకున్నది తనని కాదా… మరెవరినో తెలుసా?

టెంపర్ సినిమాలో పోసాని పాత్రలో ముందుగా అనుకున్నది తనని కాదా… మరెవరినో తెలుసా?

by Bunty
Ads

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన టెంపర్ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇక ఈ సినిమా విడుదలై ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. బిజినెస్ మాన్ సినిమా తర్వాత మంచి హిట్ లేక పూరి జగన్నాథ్ సతమతమవుతున్న సమయంలో టెంపర్ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లోనే టెంపర్ సినిమా బెస్ట్ మూవీ గా నిలిచింది.

Advertisement

READ ALSO : ఆస్పత్రి బెడ్‌ పైన ఉన్న పంత్‌ కు BCCI శుభవార్త..రూ.21 కోట్లు ఇవ్వాలని నిర్ణయం!

అయితే ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో పోసాని నటించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్, పోసాని కృష్ణ మురళి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకి హైలైట్ అయ్యాయి. ఈ సినిమాలో పోసాని డైలాగ్స్ అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమాలో పూరి జగన్నాథ్ ముందుగా పోసాని పాత్రలో పోసానిని కాకుండా పీపుల్ స్టార్ నారాయణమూర్తిని అనుకోని ఈ పాత్ర రాశారట. అందుకే పోసాని పాత్రకు మూర్తి అనే పేరు కూడా పెట్టారు.

Advertisement

ఇక ఈ పాత్రలో నటించడం కోసం పూరి జగన్నాథ్ ఆర్ నారాయణమూర్తిని ఎంత బ్రతిమిలాడినా కూడా ఈ సినిమాలో నటించినని చెప్పారట. ఇక ఈ పాత్రలో నటించమని ఎన్టీఆర్ సైతం నారాయణమూర్తి అడిగినప్పటికీ ఆయన చాలా సున్నితంగా ఈ సినిమాని రిజెక్ట్ చేయడంతో నారాయణమూర్తి స్థానంలో పోసాని కృష్ణమురళి నటించారు. ఒకవేళ పోసాని స్థానంలో నారాయణమూర్తి కనుక నటించి ఉంటే ఈ సినిమా మరో లెవెల్ లో ఉండేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక పోసాని కూడా మూర్తి అనే పాత్రకు వందశాతం న్యాయం చేశారని చెప్పాలి.

Advertisement

read also : TDP ప్రభుత్వ పునాదికి 40 ఏళ్లు..NTR తొలి కేబినెట్‌లో మంత్రులు వీళ్లే..!