Home » విద్యార్థిని చెప్పుతో కొట్టిన ఆ స్టార్ సింగర్.. వీడియో వైరల్..!

విద్యార్థిని చెప్పుతో కొట్టిన ఆ స్టార్ సింగర్.. వీడియో వైరల్..!

by Anji
Ad

పాకిస్థాన్‌కు  చెందిన ప్రముఖ స్టార్ సింగర్  రాహత్‌ ఫతేహ్‌ అలీ ఖాన్ వింత ప్రవర్తనతో వార్తల్లో నిలిచారు. తన దగ్గర మ్యూజిక్ ట్రైనింగ్ తీసుకుంటున్న విద్యార్థిని చెప్పుతో కొడుతూ విచక్షణ రహింతగా వ్యవహరించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్లు, ప్రముఖులు మండిపడుతున్నారు. ఇదేం సంస్కారమంటూ అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Advertisement

ఇక అసలు విషయానికొస్తే.. ఫతేహ్‌ అలీ ఖాన్ తన దగ్గర సంగీతం నేర్చుకుంటున్న యువకుడిని చితకబాదారు. తాను చెప్పిన పని చేయలేదనే కోపంలో ఆగ్రహానికి లోనై చెప్పుతో కొట్టాడు. వీడియోలు పరిశీలిస్తే ఒక బాటిల్ కనిపించకుండా పోయిన విషయంలో అతడిపై చేయి చేసుకున్నట్లు అర్థమవుతోంది. అయితే దెబ్బలు తట్టుకోలేక తనని వదిలేయాలంటూ బాధితుడు ప్రాధేయపడ్డాడు. అయినప్పటికీ సహనం కోల్పోయిన అలీ ఖాన్‌ అలాగే దాడి చేయడంతో పక్కనున్న ఇతరులు అడ్డుకుని శాంతింపజేశారు.

ఈ వీడియో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న రహత్ స్పందించాడు. ‘ఇది గురు, శిష్యుల మధ్య విషయం. అతను నా సొంత శిష్యుడే. నాకు కుమారుడిలాంటి వాడు. శిష్యుడు తప్పు చేస్తే గురువు దండించినట్లుగానే దీన్ని భావించాలి. ఒకవేళ అతడు మంచి చేస్తే ప్రేమ కురిపిస్తా. తప్పు చేస్తే శిక్షిస్తా’ అన్నారు. బాధితుడికి తర్వాత క్షమాపణలు చెప్పినట్లు రహత్ వెల్లడించాడు.

Visitors Are Also Reading