తెలుగు చలన చిత్ర పరిశ్రమకు సంక్రాంతి పండుగ పెద్ద పండుగ అనే చెప్పుకోవాలి. పండుగ వేళలో దాదాపు అందరూ తమ సొంత గ్రామాలకు వెళ్లి కుటుంబాలతో గడుపుతుంటారు. ఇక ఆ తరువాత జాతర్లకు వెళ్లడం.. కోడి పందాలు, గుండాటలు వంటివి ఆడుతూ కాలక్షేపం చేస్తుంటారు. జాతర ప్రారంభమవ్వడానికి ముందు ఒక సినిమా.. అలాగే సాయంత్రం జాగర ముగిసిన తరువాత మరో సినిమా చూస్తుంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సంక్రాంతి పండుగ మూడు రోజులు ఏపీలో అయితే ఇదే టైమ్ టేబుల్ ఫాలో అవుతుంటారు. కొంత మంది జాతర్లకు వెళ్లకపోయినా కుటుంబంతో కలిసి సినిమాకు వెళ్లే వాళ్లు ఎక్కువగా ఉంటారు. మొత్తానికి సంక్రాంతి పండుగకు కాసుల వర్షం కురుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
Advertisement
ప్రతీ సారి సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాలు పోటాపోటీగా నిలుస్తుంటాయి. ఇక ఈ సారి కూడా సంక్రాంతి పండుగకు పెద్ద సినిమాలు పోటీ పడేందుకు బాక్సాఫీస్ వద్దు సిద్దమవుతున్నాయి. గత రెండేళ్ల నుంచి సంక్రాంతి సినిమా సమరం ఆశించినంతగా లేదు. కరోనా మహమ్మారి నేపథ్యంలో రెండేళ్లు పెద్ద హీరోల సినిమాల మధ్య పోటీ లేకుండా పోయింది. చివరి సారిగా 2020లో అల్లు అర్జున్ అలా వైకుంఠపురం, మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు తరువాత సంక్రాంతి పండుగకి పెద్దగా పోటీ లేకుండా పోయింది. ఇక 2022లో నాగార్జున హీరోగా నటించిన బంగార్రాజు సినిమాకు చిన్న హీరోల సినిమాలు పోటీగా ఉన్నప్పటికీ బంగార్రాజు సూపర్ హిట్ గా నిలిచింది. పెద్ద హీరోల మాత్రం 2022లో పోటీలో లేవనే చెప్పాలి.
Also Read : అప్పటి ఫ్యామిలీ ఫోటోను షేర్ చేసిన మెగాస్టార్ చిరంజీవి.. తండ్రిని గుర్తు చేసుకుంటూ..!
Advertisement
2023లో మాత్రం అతిపెద్ద బాక్సాఫీస్ వార్ సిద్ధమవుతుందనే చెప్పవచ్చు. సంక్రాంతి బరిలో నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి, మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో బరిలో ఉన్నాయి. 2017 తరువాత ఇద్దరూ హీరోల సినిమాలు సంక్రాంతిఉన్నాయి. చాలా కలం తర్వాత ఇద్దరు అగ్ర హీరోల సినిమాలు సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కానుండడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు వీరిద్దరూ హీరోలు చాలా సార్లు పండుగ సీజన్ లో తలపడ్డారు. ఒకసారి ఒకరని విజయం వరిస్తే.. మరోసారి మరొకరిని విజయం వరించింది. అయితే ఈ సారి మాత్రం వీరిద్దరి సినిమాలు ఒకే బ్యానర్ లో విడుదలవ్వడం విశేషం.
Also Read : కైకాల సత్యనారాయణపై పోసాని అలాంటి కామెంట్స్ ఎందుకు చేశారు..? నెటిజన్ల ఆగ్రహానికి కారణం అదేనా ?
బాలయ్య రాయల సీమ నేపథ్యంలో రానుండడగా.. చిరు మాస్ లుక్ లో సందడి చేయనున్నారు. ఆడియో పరంగా చూసినట్టయితే చిరంజీవే ముందున్నప్పటికీ.. వీరసింహారెడ్డికే పాజిటివ్ వైబ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే బోయపాటి తెరకెక్కించిన అఖండ సూపర్ హిట్ తో బాలయ్య మంచి జోష్ లో ఉన్నారు. గాడ్ ఫాదర్ చిత్రం కమర్షియల్ గా హిట్ కాకపోవడంతో వాల్తేరు వీరయ్య సినిమాపై చిరు ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. కేవలం బాలయ్య, చిరు సినిమాలు మాత్రమే కాకుండా.. తమిళ హీరోలు విజయ్ దళపతి, అజిత్ సినిమాలు కూడా బరిలో ఉండన్నాయి. తొలుత అజిత్ నటించిన తెగింపు జనవరి 11న విడుదలవ్వగా.. జనవరి 12న వీర సింహారెడ్డి, వారసుడు చిత్రాలు విడుదల కానున్నాయి. జనవరి 13న వాల్తేరు వీరయ్య సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే వారసుడు చిత్రం నిర్మాత దిల్ రాజు కావడంతో ప్రమోషన్స్ ని చాలా వేగవంతం చేస్తూ సినిమాపై మంచి బజ్ ని పెంచుతున్నారు. బాలయ్య వీరసింహారెడ్డి, వారసుడు ఒకే రోజు విడుదలవుతుండడంతో టాలీవుడ్ లో విజయ్ కంటే బాలయ్యకే ఎక్కువ క్రేజీ ఉండడంతో బాలయ్య సినిమానే సూపర్ హిట్ గా నిలుస్తుందనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలలో ఏ సినిమా సూపర్ హిట్ గా నిలుస్తుందో వేచి చూడాలి మరి.
Also Read : ఎంత పని చేశావమ్మా.. ఇద్దరు పిల్లలు పుట్టాక.. ప్రియు*తో ఆ పని.. అసలు ట్విస్ట్ ఏంటంటే..!!