Home » తారకరత్న ప్రాణాలు పోవడానికి మొదటిరోజు జరిగిన ఆ తప్పే కారణమా..?

తారకరత్న ప్రాణాలు పోవడానికి మొదటిరోజు జరిగిన ఆ తప్పే కారణమా..?

by Anji
Ad

నందమూరి తారకరత్న జనవరి 27న నారా లోకేష్ ప్రారంభించిన ‘యువగళ’ పాదయాత్రలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఆరోజు తారకరత్న ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలడంతో అప్పటికప్పుడే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే చిత్తూరులోని ఓ ఆసుపత్రికి తరలించి.. ఆ తరువాత బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటి నుంచి కూడా తారకరత్న హెల్త్ కొంచెం క్రిటికల్ గానే ఉంది. 

Advertisement

ఆసుపత్రిలో చేరిన మొదటి రోజు నుంచి చివరి శ్వాస విడిచే వరకు కూడా తారకరత్న ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మెరుగు కనిపించకపోవడంతో డాక్టర్లు అహర్నిశలు ప్రయత్నించారు. అంతేకాదు.. తారకరత్న కోసం విదేశాల నుంచి స్పెషలిస్ట్ లను సైతం పిలిపించారు. విదేశీ వైద్యుల రాకతో నందమూరి అభిమానుల్లో ఆశలు మొదలయ్యాయి. కానీ ఫిబ్రవరి 18న తారకరత్న చనిపోయాడని తెలియడంతో అభిమానులు, ఫ్యామిలీ మెంబర్స్ శోక సంద్రంలో మునిగిపోయారు. దీంతో తారకరత్న లేడనడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.  అయితే దాదాపు 23 రోజుల పాటు డాక్టర్లు అహర్నశలు శాయశక్తులా ప్రయత్నించి తారకరత్నని బతికించలేకపోవడానికి తొలిరోజు చేసిన తప్పే కారణమా..?  అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.  

Advertisement

Also Read :  కష్ట సమయాల్లో తారకరత్న కు అండగా నిలిచింది ఇద్దరేనా…? ఆ ఇద్దరు ఎవరంటే…?

Manam News

సాధారణంగా గుండెపోటు వచ్చినటువంటి వ్యక్తికి సీపీఆర్ అనేది నిమిషాల్లోనే చేయాలి. కానీ తారకరత్న విషయంలో సీపీఆర్ చేయడానికి దాదాపు 45 నిమిషాల సమయం ఆలస్యం చేసారు. సీపీఆర్ అందాల్సిన సమయంలో కాకుండా లేటుగా చేశారు. దీంతో హార్ట్ హోల్ట్ లో బ్లడ్ క్లోట్ అయిపోవడంతో బ్రెయిన్ కి సప్లై ఆగిపోవడం వల్లనే తారకరత్న పరిస్థితి ఇంత విషమంగా మారినట్టు తెలుస్తోంది. సరైన సమయంలో సీపీఆర్ చేస్తే తారకరత్న పరిస్థితి ముందు నుంచే ఇంత సీరియస్ గా ఉండేది కాదేమో.. మెరుగైన వైద్యమందించడానికి డాక్టర్లకు ఎక్కువ అవకాశాలుండేవేమోననే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తొలి రోజు జరిగిన ఆ ఒక్క తప్పు వల్లనే తారకరత్న పరిస్థితి ప్రాణపాయంగా మారిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ తారకరత్న ఎమ్మెల్యే కావాలనే కోరిక తీరకముందే తిరిగిరాని లోకాలకు వెళ్లడం చాలా బాధకరమనే చెప్పవచ్చు. 

Also Read :  చిత్త పరిశ్రమలో మరో విషాదం…ప్రముఖ కమెడియన్ కన్నుమూత!

 

Visitors Are Also Reading