Home » కష్ట సమయాల్లో తారకరత్న కు అండగా నిలిచింది ఇద్దరేనా…? ఆ ఇద్దరు ఎవరంటే…?

కష్ట సమయాల్లో తారకరత్న కు అండగా నిలిచింది ఇద్దరేనా…? ఆ ఇద్దరు ఎవరంటే…?

by AJAY
Ad

టాలీవుడ్ లో మ‌రో విషాదం చోటు చేసుకుంది. నంద‌మూరి తార‌క‌ర‌త్న ప‌రిస్థితి విష‌మించ‌డంతో క‌న్నుమూశారు. తార‌క‌ర‌త్న ఇటీవ‌ల నారాలోకేష్ పాద‌యాత్ర‌లో పాల్గొన్నారు. యాత్రలో న‌డుస్తున్న స‌మ‌యంలో గుండెపోటు రావ‌డంతో స్పృహత‌ప్పిప‌డిపోయారు. వెంట‌నే ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా సీపీఆర్ చేసి వైద్యులు మ‌ళ్లీ బ్ర‌తికించారు. కానీ మెద‌డు పై ప్ర‌భావం ప‌డ‌టంతో తార‌క‌ర‌త్న ప‌రిస్థితి విష‌మించింది. దాంతో బెంగుళూరులోని నారాయ‌ణ హృద‌యాల‌య ఆస్ప‌త్రిలో తార‌క‌ర‌త్న తుది శ్వాస విడిచారు. ఇక తార‌క‌ర‌త్న క‌న్నుమూసిన త‌ర‌వాత ఆయ‌న గురించి ప‌లు విష‌యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

Advertisement

ఈ నేప‌థ్యంలోనే తార‌క‌ర‌త్న జీవితంలో ఎదురుకున్న క‌ష్టాల గురించి కూడా ప‌లు క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. నంద‌మూరి వార‌సుడుగా ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టిన తార‌క‌ర‌త్న ఎంట్రీతోనే ఏకంగా తొమ్మిది సినిమాల‌కు సైన్ చేశారు. మొద‌టి సినిమా ఒక‌టోనంబ‌ర్ కుర్రాడు సూప‌ర్ హిట్ అయ్యింది. కానీ త‌ర‌వాత మాత్రం కెరీర్ లో రానించ‌లేక‌పోయాడు.

Advertisement

అంతే కాకుండా తార‌క‌ర‌త్న అప్ప‌టికే పెళ్లిజ‌రిగిన డిజైన‌ర్ ను ప్రేమించి పెళ్లిచేసుకోవ‌డంతో తండ్రి మోహ‌న‌కృష్ణ ఆయ‌న పై ఫైర్ అయ్యారు. కుటుంబం అంతా తార‌క‌ర‌త్న‌ను ప‌క్క‌న పెట్టింది. అంతే కాకుండా తార‌క‌ర‌త్న భార్య కుటుంబ స‌భ్యులు కూడా వారిని ప‌క్క‌న పెట్టారు. కానీ అలాంటి స‌మ‌యంలో తార‌క‌ర‌త్న భార్య‌కు బాబాయ్ అయిన వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి వారికి అండ‌గా ఉన్న‌ట్టు తెలుస్తోంది.

అంతే కాకుండా క‌ష్ట‌స‌మ‌యాల్లో సినిమాల ప‌రంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా తార‌క్ కు అండగా నిలిచిన‌ట్టు తెలుస్తోంది. ఇక కొంతకాలంగా కుటుంబం కూడా తార‌క‌ర‌త్న‌కు ద‌గ్గ‌ర‌య్యింది. దాంతో రాజ‌కీయాల్లో మ‌రియు సినిమాల్లో కూడా ఆయ‌న బిజీగా గ‌డిపిన సంగ‌తి తెలిసిందే. కానీ అలాంటి స‌మ‌యంలోనే ఆయ‌న మ‌ర‌ణం బాధాక‌రం.

ALSO READ: నారా వారి క్షుద్ర పూజలకు..తారక్ బలి – శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Visitors Are Also Reading