Home » శోభన్ బాబు జయలలిత లవ్ స్టోరీ.. ఆ డైరీలో ఏముందో తెలుసా ?

శోభన్ బాబు జయలలిత లవ్ స్టోరీ.. ఆ డైరీలో ఏముందో తెలుసా ?

by Anji
Ad

తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, కృష్ణ వీరు నలుగురు నాలుగు స్థంబాల లాంటి వారు. వీరందరూ అటు ఇటు ఒకేతరం హీరోలు.. అప్పట్లో ఒకరికంటే ఒకరు పోటీ పడుతూ నటించి అందరూ మంచి గుర్తింపు సాదించుకున్నారు. ఇందలో ఎన్టీఆర్-ఏఎన్నార్, కృష్ణ, చివరిసమయంలో క్యారెక్టర్ గా ఆర్టిస్ట్ గా నటించారు. శోభన్ మాత్రం ఎన్ని డబ్బులు ఆఫర్ చేసినప్పటికీ క్యారెక్టర్ ఆర్టీస్ట్ గా చేయడానికి అస్సలు ఒప్పుకోలేదట.


హీరో పేరుతోనే చనిపోవాలనుకున్నారు అదేవిధంగానే ఆయన మరణించారు. అలాగే శోభన్ బాబు హీరోగా మంచి ఫామ్ లో ఉండగానే.. చాలమంది హీరోయిన్స్ ఆయనను ఇష్టపడేవారట. అంతటి అందగాడు శోభన్ బాబు. అలాంటి ఆయన పెళ్లి తరువాతకూడ హీరోయిన్, రాజకీయ నాయకురాలు జయలలితను ప్రేమించాడట. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాడు. అది మాత్రం కుదరలేదు. దీంతో జయలలిత, శోభన్ బాబుని మరిచిపోలేక పెళ్లి కూడా చేసుకోలేదు. వీరిద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు. వీరి కాంబోలో వచ్చినటువంటి డాక్టర్ బాబు సినిమా సూపర్ హిట్ అయింది. ఈ మూవీ షూటింగ్ జరుగుతున్న సమయంలోనే జయలలిత తల్లి మరణించింది. దీంతో డిప్రెషన్ లో ఉన్నటువంటి జయలలితకు అన్ని తానే చూసుకునేవారట శోభన్ బాబు. అప్పుడే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని శోభన్ బాబు ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు.

Advertisement

Advertisement

డాక్టర్ బాబు సినిమా షూటింగ్ ఊటిలో జరిగింది. శోభన్ బాబు, జయలలిత గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తన డైరీలో పొందుపరుచుకున్నారు శోభన్ బాబు. ముఖ్యంగా చాలా బరువైనటువంటి నా మనస్సును నీవే తేలిక చేశావు. ప్రపంచమంతా ఇప్పుడు చాలా నిశ్చలంగా కనిపిస్తుంది. అందరితో మాట్లాడాలని కలిసి ఉండాలని నాకు అనిపిస్తున్నదని జయలలిత తనతో చెప్పినట్టు శోభన్ బాబు డైరీలో రాసుకొచ్చారు. నా అనుకున్న వారు నన్ను మోసం చేశారు. నా తల్లి మరణించి కొన్ని నెలలు కూడా కాలేదు. కానీ ఎన్నో నెలలు అయినట్టు అనిపిస్తుంది. ఆమెను నేను అంతలా మరిచిపోవడానికి కారణం నువ్వే అంటూ చెప్పిందట జయలలిత. బంధువులు డబ్బుల కోసం మాత్రమే నాదగ్గర ఉన్నారు. అసలు ఎవ్వరినీ నమ్మాలో ఎవ్వరినీ నమ్మకూడదో తెలియడం లేదు. నా తల్లి మరణిస్తే నన్ను ఎవ్వరు చేరదీయలేదు. ఆ సమయంలో నీవే అండగా నిలిచావు అంటూ శోభన్ బాబుతో జయలలిత చెప్పిందట. ఈ విషయాలన్నింటినీ శోభన్ బాబు తన డైరీలో క్లియర్ గా రాసుకున్నారు. ఏది ఏమైనప్పటికీ అప్పట్లో జయలలిత, శోభన్ బాబు ప్రేమ ఓ సంచలనమనే చెప్పాలి.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

హీరో గోపీచంద్ భార్యను ఎప్పుడైనా చూశారా.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి ?

పోతినేని రామ్ పెళ్లి చేసుకోబోతున్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా?

Visitors Are Also Reading