మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. రీ ఎంట్రీ ఇచ్చిన తరువాత వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు చిరంజీవి. తాజాగా గాడ్‌ఫాదర్ సినిమా వచ్చిన విషయం విధితమే. అయితే ఈ సినిమా ఊహించనివిధంగా రిజల్ట్స్ అందుకుంది. అందరి అంచనాలను తారుమారు చేస్తూ బ్లాక్‌బస్టర్ హిట్ గా నిలిచింది. తాజాగా నిర్వహించిన సక్సెస్ మీట్‌లో చిరంజీవి స్వయంగా తాను నటించిన టాప్ 15 చిత్రాల్లో గాడ్‌ఫాదర్ ఒకటి అని చెప్పుకొచ్చారు.
Also Read : అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన 12 సినిమాల్లో సగం బ్లాక్‌బస్టర్లే అనే విషయం మీకు తెలుసా ?
Advertisement
తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది. లేడీ సూపర్ స్టార్ నయనతార మెగాస్టార్ కు చెల్లెలి పాత్రలో నటించగా.. సత్యదేవ్ విలన్ పాత్రలో తన నటనతో అందరినీ మెప్పించాడు. అదేవిధంగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, మాస్ దర్శకుడు పూరిజగన్నాథ్, అనసూయ, సునీల్ వంటి వారు ముఖ్య పాత్రల్లో నటించారు. అయితే ఈ సినిమా విడుదలైన తర్వాత అందరూ.. సల్మాన్ ఖాన్ పాత్రలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను తీసుకొని ఉంటే బొమ్మ బ్లాక్ బస్టర్ అయ్యేది అని చాలామంది కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. సల్మాన్ ఖాన్ రోల్ మాత్రం తెలుగు ఆడియన్స్ ను అలరించలేక పోయిందనే చెప్పాలి. ఇతడు కేవలం హిందీ లో రిలీజ్ చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడ్డారు కానీ ఎలాంటి ప్రభావం చూపలేక పోయాడు.
Advertisement
Also Read : నటుడు నూతన్ ప్రసాద్ గురించి ఈ ఒక్క విషయం మీకు తెలుసా..?
అందుకే పవన్ కళ్యాణ్ ఉంటే బాగుండేది అని మెగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మెగా అన్నదమ్ములు ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే ఆ కిక్ వేరుగా ఉండేది అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ కాకపోయినా ఏ మెగాహీరో అయిన చేసిన ఆ సీన్ వేరేగా ఉండేది అని అంటున్నారు. ఈ క్రమంలోనే మోహన్ రాజా తాజాగా ఈ విషయంపై మాట్లాడారు.సల్మాన్ ఖాన్ ను తీసుకోవడం తన ఛాయిస్ అని. అయితే ఆయన్ని అలంకరణ కోసమే అని మోహన్ రాజా తెలిపారు. “నేను దీన్ని సినిమాగా చూశానని, పర్సనల్ కనెక్షన్ గురించి ఏమాత్రం ఆలోచనలేదు. ఫ్యామిలీలో హీరో అని చెప్పడం కంటే బయటనుండి స్టార్ గురించి చెప్పడం బాగుంటుంది అని నేను అనుకున్నా. అలా అయితే ఫ్రెష్ గా ఉంటుందని భావించాను” అని చెప్పుకొచ్చాడు దర్శకుడు మోహన్ రాజా.
Also Read : కోట శ్రీనివాస్ రావు కి కృష్ణం రాజు గారు చేసిన ఈ సహాయం గురించి తెలుసా ?