Home » చిన్న పిల్లవాడి కథ చెబుతున్న హీరో యష్.. ఏమన్నారంటే..!!

చిన్న పిల్లవాడి కథ చెబుతున్న హీరో యష్.. ఏమన్నారంటే..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

కేజిఎఫ్, కేజిఎఫ్ 2 ద్వారా తన సత్తా చూపించి పాన్ ఇండియా లెవెల్ లో ఎంతో పేరు సంపాదించిన హీరో యష్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు. రాఖీ బాయ్ ప్రధానపాత్రలో ఆయన నటన చూస్తే గూస్ బంప్స్ వస్తాయి. అంతటి ఘనత సాధించిన కేజిఎఫ్ చాప్టర్ 2 హిందీ వెర్షన్ లో కూడా 250 కోట్ల రూపాయల క్లబ్ లో చేరుకున్నది. ఇప్పటికే ఈ సినిమా ప్రపంచం మొత్తం ఏడు వందల కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టిస్తోంది.

Advertisement

ఇంతటి ఆదరణ వస్తున్న వేళ సోషల్ మీడియా వేదికగా హీరో యష్ ఒక వీడియో ద్వారా స్పందించారు. ఈ వీడియోలో ఆయన ఒక చిన్న పిల్లవాడి కథ గురించి వివరిస్తూ, తనను తాను చిన్నపిల్లడిలా పోల్చుకుంటూ సినిమా ఇంతటి సక్సెస్ ఇచ్చిన అభిమానులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాల అని అన్నారు. నేను ఇంతటి ఘనత సాధించడానికి ప్రధాన కారణం మీరేనని నాపై ఇంత ప్రేమ అభిమానం చూపించినందుకు ధన్యవాదాలు ఎలా చెప్పాలో కూడా అర్థం కావడం లేదని తెలియజేశాడు. సినిమా టీం మొత్తం చాలా ఆనందంగా ఉన్నామని మీ అందరికీ నేను ఒక గొప్ప అనుభూతిని అందించాను అనుకుంటున్నానని, మీరు ఈ సినిమా ద్వారా ఆనందించడమే కాకుండా ఆస్వాదిస్తూ ఉన్నారని నేను ఆశిస్తున్నాను అంటూ చెప్పారు. దీంతో చాలా మంది అభిమానులు కామెంట్ల ద్వారా హీరో యష్ కు కంగ్రాట్స్ తెలియజేశారు. లవ్ సింబల్స్ తో అభిమానులు అలజడి సృష్టిస్తున్నారు. ఈ సినిమా హిందీ వెర్షన్ లో కేవలం ఏడు రోజులలోనే 250 కోట్లు వసూలు చేసి బ్లాక్ బాస్టర్ గా, హిందీ చిత్రాలకు దీటుగా ముందుకు వెళ్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో సంజయ్ దత్, శ్రీనిధి, రవీనా టాండన్ కీలక పాత్రలో నటించారు.

ALSO READ:

 

ఆ స్టార్ హీరో భార్య ఆయనను కొడుతుందట..హింస భరించలేక ఆయన ఏం చేసారంటే..!!

 

Tollywood: ఎన్టీఆర్ నుండి పవన్ వరకు రెండు పెళ్లిల్లు చేసుకున్న తెలుగు నటులు ఎవరో

తెలుసా ?

 

 

Visitors Are Also Reading