Home » ‘నాటు నాటు’కు ఆస్కార్.. తమ్మారెడ్డి రియాక్షన్ ఇదే..!

‘నాటు నాటు’కు ఆస్కార్.. తమ్మారెడ్డి రియాక్షన్ ఇదే..!

by Bunty
Ad

 

ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్‌ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఆస్కార్ ప్రమోషన్స్ కోసం ఆర్ఆర్ఆర్ టీమ్ రూ. 80 కోట్లు ఖర్చు చేసిందని ఆ డబ్బు తమకిస్తే 8 సినిమాలు తమ్మారెడ్డి చేసిన వాక్యాలు తీవ్రదుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. తెలుగు సినిమా గురించి ప్రపంచమంతా మాట్లాడుతుంటే తెలుగు వాళ్ళై ఉండి ఇలా కామెంట్స్ చేయడం ఏంటని తమ్మారెడ్డిపై పలువురు సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

READ ALSO : భూమా మౌనిక వీపుపై సీక్రెట్ టాటూ… మనోజ్ ఆగ్రహం ?

Advertisement

ఇదిలా ఉంటే తాజాగా 95 వ ఆస్కార్ అవార్డుల వేడుకలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాట ఆస్కార్ పురస్కారాన్ని సొంతం చేసుకుంది. హాలీవుడ్ పాటలను తలదన్ని నాటు నాటు విజయకేతనం ఎగరేవేసింది. తెలుగువాడి ప్రతిభకు ఆస్కార్ పట్టం కట్టింది. దీంతో ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి యావత్ సినీ రాజకీయ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వేళ్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ స్పందన కోసం నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. తాజాగా నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంపై తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు.

Advertisement

READ ALSO :  12 ఏళ్లు ప్రేమించుకున్నాం… 6 ఏళ్లు కష్టాలు అనుభవించాం- మంచి మనోజ్

RRR Oscor

ఆయన ఏమన్నారంటే… ‘మన తెలుగు పాటకు ఆస్కార్ రావడం చాలా ఆనందంగా, గర్వంగా ఉంది. నాకే కాదు ప్రతి భారతీయుడు, సినిమాను ప్రేమించే వాళ్లకు ఇది గర్వ కారణం. తెలుగు సంగీతాన్ని తెలుగుదనాన్ని ఇప్పటికీ తమ సినిమాల్లో పొందుపరుస్తున్న అతికొద్ది మందిలో కీరవాణి, చంద్రబోస్ ఒకరు. వాళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన నాటు నాటు పాటకు ఆస్కార్ రావడం చాలా అద్భుతమైన విషయం. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ టీమ్ కి నా అభినందనలు తెలియజేస్తున్నాను’ అంటూ తమ్మారెడ్డి పేర్కొన్నారు.

READ ALSO : కూతురిని హెలికాప్టర్ లో అత్తారింటికి సాగనంపిన తండ్రి..వీడియో వైరల్ !

Visitors Are Also Reading