Home » నవ్వుతూనే దేవి శ్రీ ప్రసాద్ మీద అసూయని బయట పెట్టిన తమన్..!

నవ్వుతూనే దేవి శ్రీ ప్రసాద్ మీద అసూయని బయట పెట్టిన తమన్..!

by Sravya
Ad

తమన్ కి ఎక్కువ అవకాశాలు వస్తూ ఉంటాయి. తమన్ పాతిక సినిమాలు చేస్తే, దేవిశ్రీప్రసాద్ కి ఒక్క సినిమా ఇస్తారు. కానీ దేవిశ్రీప్రసాద్ ఇచ్చే అవుట్ ఫుట్ ని అంతా పాతిక తో సమానంగా ఉంటుంది. తమన్ ఏ పాట ఇచ్చినా ఎక్కడి నుండో పట్టుకొచ్చినట్లే ఉంటుంది. కాపీ కాట్ అని కూడా తమన్ ని పిలుస్తూ ఉంటారు విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళిద్దరికీ పోటీ పెడుతూ సూపర్ సింగర్ పాటల కార్యక్రమం వినోదాత్మకంగా సాగింది. శ్రీముఖి హోస్ట్ చేస్తున్న సూపర్ సింగర్ స్టార్ మా చానల్లో శనివారం, ఆదివారం ప్రసారమవుతుంది.

Advertisement

ఈవారం తమన్ వర్సెస్ డిఎస్పి స్పెషల్ సాంగ్స్ పై రసవత్తరంగా సాగింది. తమన్ దేవిశ్రీ పాటల్ని పోటీదారులు పాడడం జరిగింది. రాహుల్ సిప్లిగంజ్, శ్వేత మోహన్, మంగ్లీ జడ్జిలుగా ఉంటున్నారు. తమన్ స్పెషల్ గెస్ట్ గా వచ్చారు. ముందు డీఎస్పీ పాటలు పాడారు అవి తమన్ పాటలు కంటే అద్భుతంగా ఉండడంతో తమన్ కి కాస్త కాలింది నా సాంగ్స్ కంటే దేవిశ్రీ పాటలు బ్యాండ్ బాగా వాయిస్తున్నారని నవ్వుతూనే సాంగ్స్ కి అద్భుతంగా మ్యూజిక్ వాయించిన బ్యాండ్ పై సెటైర్లు వేశారు.

Advertisement

మగువా మగువా పాటకి ఆర్కెస్ట్రా బాగా వాయించడం తో చాలా రోజులకి నా పాటలకి కూడా బ్యాండ్ బాగా వాయించారన్నారు. నా పాటలు ని అలా వదిలేస్తారు డిఎస్పి పాటలకి అయితే బాగా వాయిస్తారని నవ్వుతూ చెప్పారు నువ్వొస్తానంటే నేనొద్దంటానా, వర్షం సినిమాలో పాటను కూడా అద్భుతంగా పాడడంతో దేవి శ్రీ ప్రసాద్ ప్రస్తావన తీసుకువచ్చి మళ్ళీ తమన్ కుళ్ళుకున్నాడు. ఆర్కెస్ట్రా వాళ్ళకి సౌండింగ్ నేను ఉన్నప్పుడు డిఎస్పీ పాటలకి ఇంకా బాగా వాయిస్తున్నారని అసూయ చూపించాడు. బాగా మండి పడుతున్నట్లు ఉంది అని వాయిస్ వినిపించడంతో అది మాత్రం నిజమే అని ఒప్పేసుకున్నారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading