Home » తలా బ్యానర్ లో తలపతి…!

తలా బ్యానర్ లో తలపతి…!

by Azhar
భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గురించి అందరికి తెలిసిందే. తన స్టైల్ అయిన కూల్ నెస్ తో మొత్తం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు ధోని. కెప్టెన్ గా జట్టుకు ఎన్ని విజయాల్ని టైటిల్స్ ను అందించిన ధోని  2019 లో అంతరాఠిన్య క్రికెట్ నుండి రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఆ తర్వాత కేవలం ఐపీఎల్ కొనసాగుతూ మిగితా రోజులు మొత్తం బిజినెస్ పైన తన దృష్టి పెడుతున్నాడు ధోని. ఇందులో ఖాళీ ఉంటె అందులో దూరిపోతున్నాడు. ప్రస్తుతానికి ఎక్కువగా వ్యవసాయం మీద దృష్టి పెట్టాడు ధోని.
అయితే ధోని పుట్టింది జార్ఖండ్ లోనైనా.. అక్కడి కంటే ఎక్కువగా తమిళనాడులో ధోనికి అభిమానులు ఉంటారు అనేది నిజం. దానికి కారణం ఐపీఎల్. ఈ లీగ్ లో తమిళనాడు కు సంబంధించిన చెన్నై సూపర్ కింగ్స్ కు కెప్టెన్ గా వ్యవరించే ధోని.. ఇక్కడ కూడా కెప్టెన్ గా జట్టుకు నాలుగు టైటిల్స్ అందించాడు. అందుకే తమిళనాడులో ధోనికి భారీ ఫ్యాన్ ఫాలింగ్ ఉంది. ఇక్కడ అభిమానులు అందరూ ధోనిని తలా అని పిలుస్తుంటారు. ఇక ధోనికి తమిళనాడు అంటే చాలానే ఇష్టం. అందుకే ఐపీఎల్ లో తన రిటైర్మెంట్ ను చెన్నై అభిమానుల ముందు ఇవ్వాలనే ఉదేశ్యంతోనే ఇంకా ధోని ఐపీఎల్ లో కొనసాగుతున్నాడు. ఈ విషయాన్ని తలా కూడా ఇప్పటికే చెప్పేసాడు.
అందుకే ఇక్కడ నుండే తన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాలని ధోని అనుకుంటున్నాడు. అదేంటంటే ధోని ప్రొడ్యూసర్ గా అవతారం ఎత్త బోతున్నాడు. నిర్మాతగా తన ప్రయాణాన్ని కోలీవుడ్ లో అది కూడా ఇక్కడి తలపతి విజయ్ తో మొదటి సినిమా చేయబోతున్నాడు ధోని అనే ప్రచారం జరుగుతుంది. కానీ ఇందులో ఎంత నిజం ఉంది అనేది తెలియదు. ఇక ప్రస్తుతం తెలుగు డైరెక్టర్ వంది పైడిపల్లి దర్శకత్వంలో వారసుడు అనే సినిమా చేస్తున్న విజయ్.. దీని తర్వాత ధోని ప్రొడక్షన్ లోనే సినిమా చేయనున్నాడు అని తెలుస్తుంది. కానీ ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేయనున్నారు అనేది మాత్రం తెలియదు.
Visitors Are Also Reading