Home » ఫీల్డర్ కావాలనే బాల్ ను బౌండరీ బయటకు వేస్తే ఏం చేస్తారో తెలుసా..?

ఫీల్డర్ కావాలనే బాల్ ను బౌండరీ బయటకు వేస్తే ఏం చేస్తారో తెలుసా..?

by Azhar
Ad

క్రికెట్ అనేది జెంటిల్ మెన్ గేమ్ అనేది అందరికి తెలిసిన విషయమే. మొత్తం ప్రపంచంలోనే ఫుట్ బాల్ తర్వాత అత్యధిక ఫాలోయింగ్ ఉన్న క్రింద క్రికెట్. అయితే ఏ ఆటలోనైనా ఆటగాళ్లు తప్పులు చేయడం సహజం. అది కావాలని ఐన కావచ్చు. లేక అనుకోకుండా కూడా కావచ్చు. ఇలా చేసినప్పుడు ఫుట్ బాల్ అయితే ఆటగాళ్లు గ్రీన్, ఎల్లో, రెడ్ అంటూ కార్డుల రూపంలో శిక్ష అనేది ఇస్తారు. కానీ అదే క్రికెట్ లో అయితే ఇలా కార్డ్స్ ఉండవు. ఇందులో ఆటగాళ్లు చేసిన తప్పును బట్టి శిక్ష అనేది ఉంటుంది.

Advertisement

అయితే క్రికెట్ లో ఆటగాళ్ల మధ్య గొడవ జరిగితే.. వారికీ ఫైన్ అంటే వారి మ్యాచ్ ఫీజులు కొత్త విధించడం లేదా వారిని ఇన్ని మ్యాచ్ లకు అంటూ ఆడకుండా బ్యాన్ చేయడం వంటివి చేస్తారు. ఈ క్రికెట్ లో ఫీల్డింగ్ చేసే ఆటగాళ్లు బంతిని అప్పే సమయంలో కొన్నిసార్లు అది అనుకోకుండా బౌండరీ వెళ్ళిపోతుంది. కానీ ఒకవేళ ఫీల్డర్ కావాలనే బంతిని బౌండరీ బయటకు వేస్తే వేస్తే వారికీ ఏ విధమైన శిక్ష అనేది విధిస్తారు అని మీకు తెలుసా..? ఈ తప్పు క్రికెట్ లో చాలాసార్లు జరిగింది. ఒకసారి మన భారత ఓపెనర్ సెహ్వాగ్ కూడా ఇలా చేసాడు.

Advertisement

దాంతో సెహ్వాగ్ చేసిన తప్పును గమనించిన అంపైర్.. అక్కడ కావాలనే బాల్ ను బౌండరీ బయటకు తన్నాడు అని చూసి శిక్షగా 5 పరుగుల పెనాల్టీ అనేది వేసాడు. అయితే ఈ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా 9 వికెట్లు కోల్పోయింది. కానీ చివర సఫారీ బ్యాటర్ ఆమ్లా.. మరో బౌలర్ క్రీజులో ఉన్నారు. అప్పుడు ఆమ్లా ఓవర్ చివరి బంతిని సింగిల్ తీసి తరువాత ఓవర్ లో కూడా తానే బ్యాటింగ్ తీసుకోవాలని బంతిని నెమ్మదిగా కొట్టాడు. కానీ అది బౌండరీ చాల దగ్గరగా వెళ్లి ఆగిపోయింది. కానీ దాని వెనుక వెళ్లిన సెహ్వాగ్.. తర్వాత ఓవర్ లో ఆ బౌలర్ కు బ్యాటింగ్ వస్తే అతడిని ఔట్ చేయడం సులువు అని అనుకోని బంతిని బౌండరీ బయటకు తన్నాడు. దీంతో శిక్షగా 5 పరుగులు ఇవ్వడమే కాకుండా తర్వాతి ఓవర్ లో కూడా ఆమ్లానే బ్యాటింగ్ స్ట్రైక్ లో ఉండేలా అంపైర్ నిరయం తీసుకున్నాడు.

ఇవి కూడా చదవండి :

ప్రపంచ కప్ ముందు బీసీసీఐ పిచ్చి ప్రయోగం.. ఓపెనర్ గా పంత్…!

రాహుల్ తెవాటియా విషయంలో బీసీసీఐ తప్పు చేస్తుందా…?

Visitors Are Also Reading