ఆమె ఆటను ఆడడం మానేసింది. అయినా ఆమె పట్ల ప్రపంచానికి ఉన్న అభిమానం మాత్రం తరగనిదనే చెప్పాలి. మాజీ టెన్నీస్ క్రీడాకారిని మారియా షరపోవా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఒక కీలక ప్రకటన చేసింది. తాను తల్లి కాబోతున్నట్టు ఎంతో సంతోషంగా చెప్పింది. తన 35వ పుట్టిన రోజునే ఆమె ఈ ప్రకటన చేయడం విశేషం.
Advertisement
రష్యాకు చెందిన మాజీ టెన్నిస్ క్రీడాకారిణి, కోర్టులో లేకుండా ఉన్నా టెన్నిస్ క్వీన్ గా మన్ననలు పొందుతున్న మారియా షరపోవా తన అభిమానులతో ఈ శుభవార్తను పంచుకున్నారు. త్వరలో తాను తల్లి కాబోతున్నట్టు వెల్లడించారు. అమూల్యమైన సరికొత్త ఆరంభాలు.. అంటూ తాను గర్భవతిని అనే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. బేబీ బంప్ బీచ్‌లో నిలుచుని ఉన్న ఫోటోను షేర్ చేసిన షరపోవా తల్లి కాబోతున్న అనుభూతులను పదిలం చేసుకుంటున్నట్టు చెప్పారు.
View this post on InstagramAdvertisement
షరపోవా వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. వివాదస్పద మలుపులతో టెన్నిస్ కెరీర్‌ను ముగించిన షరపోవా బ్రిటిష్ వ్యాపారవేత్త అలెగ్జాండర్ గిల్కెస్ తో కలిసి ఉంటుంది. అయితే వీరికి 2018లోనే ఎంగెజ్మెంట్ అయినట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బ్రిటన్ రాజకుటుంబానికి అలెగ్జాండర్ దగ్గరి బంధువు. ఇక తన కెరీర్లో5 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను గెలిచిన షరపోవా 2020లో టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసినదే. మరొక ఉన్నత శిఖరాన్ని అధిరోహించడానికి సిద్ధమయ్యాను. విభిన్నమైన మైదానంలో పోటీ పడేందుకు టెన్నిస్‌కు గుడ్‌బై చెబుతున్నట్టు తన నిర్ణయాన్ని వెల్లడించారు. ఇక అత్యంత త్వరలోనే మారియా షరపోవా బిడ్డకు జన్మనివ్వబోతున్నారు.
ఇవి కూడా చదవండి
- ఎండ తీవ్రతకు మీ శరీరాన్ని యాక్టివ్‌గా మార్చే ఎనర్జిటిక్ డ్రింక్ ఇదే..!
- అప్పట్లోనే వచ్చిన ఈ 10 సినిమాలను పాన్ ఇండియా లెవెల్లో తీసుంటే… బ్లాక్ బస్టరే..?
- కళాకారుల కోసం 600 కోట్ల భూమిని దానం ఇచ్చిన నటుడి గురించి ఇది తెలుసుకోవాల్సిందే..!