Home » కళాకారుల కోసం 600 కోట్ల భూమిని దానం ఇచ్చిన నటుడి గురించి ఇది తెలుసుకోవాల్సిందే..!

కళాకారుల కోసం 600 కోట్ల భూమిని దానం ఇచ్చిన నటుడి గురించి ఇది తెలుసుకోవాల్సిందే..!

by Sravanthi Pandrala Pandrala
Ad

సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక కొత్త స్టైల్, క్రియేట్ చేసే కళా మందిరం. ఇక్కడికి వచ్చి ఎంతో మంది హీరోలు మంచి పేరుతో పాటుగా ఎంతో సంపదను కూడా కూడబెట్టుకుంటున్నారు. ఇలా సంపాదించిన వారిలో కొంతమంది వారి వారి కుటుంబ సభ్యులు, బంధువులను ఇండస్ట్రీలోకి తీసుకు వస్తూ ఉంటారు. వారితో వ్యాపారాలు చేస్తూ మరింత సంపాదించాలని అనుకుంటారు. కానీ కొంతమంది మాత్రం వారికి ఎంత వచ్చినా అందులో కొంత అయినా సరే ఎదుటివారి కష్టాలలో ఉంటే ఆదుకోవాలని భావిస్తారు. అలాంటి గొప్ప మనసున్న వ్యక్తి నటుడు ప్రభాకర్ రెడ్డి. ఈయన వృత్తిరీత్యా వైద్యులు అయినా నటనపై మక్కువతో ఇండస్ట్రీ లోకి వచ్చారు. తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా హిందీ తమిళ చిత్రాల్లో కూడా ప్రభాకర్ రెడ్డి విలన్ పాత్రలు చేశారు. ఆయన 37 సంవత్సరాల సినీ జీవితంలో 500కు పైగా చిత్రాల్లో నటించారు. ఎన్నో విలక్షణ పాత్రలతో

Advertisement

Advertisement

అభిమానులను నొప్పించారు. ఆయన నటనే కాకుండా దర్శకత్వం మరియు నిర్మాతగా కూడా చేసి ఎన్నో విజయాలు అందుకుని మంచి గుర్తింపు సాధించారు. ఈయన ఏఎన్ఆర్, ఎన్టీఆర్ మరియు చిరంజీవి వరకు ఎన్నో సినిమాల్లో విలన్ గా నటించి ఆకట్టుకున్నారు. అయితే ప్రభాకర్ రెడ్డి సూర్యాపేట జిల్లా, తుంగతుర్తి లో జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం కూడా తుంగతుర్తి లోనే కొనసాగింది. తర్వాత హైదరాబాద్ సిటీ కాలేజీలో ఇంటర్ పూర్తి చేశారు. తర్వాత ఉస్మానియా వైద్య కళాశాలలో మెడిసిన్ పూర్తిచేసి, డాక్టర్ వృత్తిలోకి పోకుండా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రభాకర్ రెడ్డి పచ్చని సంసారం,

పండంటి కాపురం, గాంధీ పుట్టిన దేశం, గృహప్రవేశం, కార్తీకదీపం, ఇలా ఇరవై ఒక్క తెలుగు సినిమాలకు కథలను రాశారు. ఈయన రాసిన కథలు సినిమాలన్నీ మంచి విజయం సాధించాయి. ఈయన నటుడిగా ఉన్న సమయంలో తెలుగు ఇండస్ట్రీ మద్రాసులో ఉండేది. తర్వాత దాన్ని హైదరాబాద్ తీసుకు వచ్చారు. ఆ సమయంలో ప్రభుత్వం సినీ నటులకు ఎకరాల కొద్దీ భూమి ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. అలాగే ప్రభాకర్ రెడ్డి మాత్రం తనకు వచ్చిన పది ఎకరాల భూమిని ఇండస్ట్రీలోని పేద కళాకారుల కోసం ఇచ్చారు. ఆయన ఇచ్చిన భూమిలోనే ప్రస్తుతం ఎంతో ఫేమస్ అయిన చిత్రపురి కాలనీ ఏర్పడింది. అందుకే దీన్ని ప్రభాకర్రెడ్డి చిత్రపురి కాలనీ అని పిలుస్తారు. ఈయన ఒక్క రూపాయి కూడా ఆశించకుండా పది ఎకరాల భూమిని దానం చేశారు. ఇంత గొప్ప మనసు ఎవరికైనా ఉంటుందా..!

Visitors Are Also Reading