Home » అప్పట్లోనే వచ్చిన ఈ 10 సినిమాలను పాన్ ఇండియా లెవెల్లో తీసుంటే… బ్లాక్ బస్టరే..?

అప్పట్లోనే వచ్చిన ఈ 10 సినిమాలను పాన్ ఇండియా లెవెల్లో తీసుంటే… బ్లాక్ బస్టరే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

సినిమాలో కంటెంట్ ఉంటే ఏ ప్రేక్షకుడు అయినా ఆ సినిమాను ఆదరిస్తారు. అది ఏ భాషలో ఉన్నా సరే అందులో కథ చాలా ముఖ్యం. అలాంటి దానికి ఒక ఉదాహరణ కమలహాసన్, రజినీకాంత్ లాంటి పెద్ద హీరోలు తమిళ ఇండస్ట్రీ కంటే తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువ మంది ప్రేక్షకులను సంపాదించారని చెప్పవచ్చు. వీరి తర్వాత వచ్చిన సూర్య, విక్రమ్ కూడా ఇక్కడ మంచి మార్కెట్ ను ఏర్పాటు చేసుకున్నారు. కానీ తమిళ ఇండస్ట్రీలో మాత్రం మన తెలుగు హీరోలను అసలు ఎంకరేజ్ చేయరు. ఎంత మంచి కంటెంట్ వచ్చిన వాళ్ల హీరోలు మాత్రమే చేయాలి. అలా అయితేనే వారు సినిమా చూస్తారు..? అందుకే శంకర్ చిరంజీవితో సినిమాలు చేయలేదు.. అని ఎవరో అడిగితే చెప్పిన సమాధానం ఇది.. చిరంజీవి తెలుగు ఇండస్ట్రీలో పెద్ద స్టార్.. కానీ తమిళ జనాలు తెలుగు హీరోల సినిమాలు అస్సలు చూడరు. టాలీవుడ్ మార్కెట్ కంటే కోలీవుడ్ మార్కెట్ చాలా పెద్దది. అలాగే బాలీవుడ్ లో కూడా ఇదే పరిస్థితి. అందుకే అప్పట్లో ఎన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ వచ్చినా పాన్ ఇండియా జోలికి పోలేదు మన ఇండస్ట్రీ వాళ్ళు. గతంలో కూడా మన తెలుగు ఇండస్ట్రీలో పాన్ ఇండియా కంటెంట్ ఉన్నటువంటి సినిమాలు వచ్చాయి మరి అవేంటో చూద్దామా..!

సింహాసనం: ఈ సినిమాకు కృష్ణ గారు దర్శకత్వం వహించి తానే నటించారు. ఈ మూవీలో కూడా ఫాను ఇండియా లెవెల్ లో సక్సెస్ అయ్యే కంటెంట్ ఉంటుంది.

Advertisement

 

ఖైదీ : కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన సినిమా ఖైదీ. ఇందులో చిరంజీవి హీరోగా నటించారు. ఇది చిరంజీవికి మంచి పేరు తెచ్చిపెట్టింది.

జానకి రాముడు: ఈ మూవీ రాఘవేంద్ర రావు దర్శకత్వంలో 1988 లో వచ్చింది. హీరోగా నాగార్జున హీరోయిన్ గా విజయశాంతి జంటగా నటించారు. ఇది కూడా పాన్ ఇండియా లెవెల్ కు రీచ్ అయ్యే కంటెంట్ ఉన్న మూవీ.

తాండ్రపాపారాయుడు: దాసరి నారాయణరావు దర్శకత్వంలో కృష్ణంరాజు హీరోగా వచ్చిన ఈ మూవీ పాన్ ఇండియా కంటెంట్ ఉన్నది. సూర్యనారాయణ రాజు దీనికి నిర్మాత.

Advertisement

ఆదిత్య 369 : బాలకృష్ణ హీరోగా ఆదిత్య 369 సైన్స్ ఫిక్షన్ మూవీగా వచ్చింది. దీనికి సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. ఇది కూడా పాన్ ఇండియా కంటెంట్ ఉన్న సినిమా.

గ్యాంగ్ లీడర్ : చిరంజీవి మరియు విజయశాంతి జంటగా నటించిన ఈ సినిమాను విజయ్ బాపినీడు దర్శకత్వం వహించారు. ఇది కూడా పాన్ ఇండియా లెవెల్లో రీచ్ అయ్యే కంటెంట్ ఉన్న సినిమా.

 

బొబ్బిలి రాజా : వెంకటేష్ హీరోగా నటించిన ఈ సినిమాకు బి.గోపాల్ దర్శకత్వం వహించారు. ఇది పాన్ ఇండియా లెవెల్ కంటెంట్ ఉన్న సినిమా.

పోకిరి: ఈ మూవీతోనే మహేష్ బాబు సూపర్ స్టార్ గా మారారు. ఇది కూడా పాన్ ఇండియా కంటెంట్ ఉన్న సినిమా. దీనిని అన్ని భాషల్లో రీమేక్ చేసుకున్నారు.

 

మగధీర : దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ ఫాను ఇండియా కంటెంట్ తో రూపొందించిందే. కానీ కొన్ని రోజుల తర్వాత మలయాళం తమిళ్ లో మాత్రమే రిలీజ్ చేశారు.


సింహాద్రి: ఈ మూవీ కూడా రాజమౌళి దర్శకత్వంలో వచ్చింది. ఇందులో కూడా పాన్ ఇండియా రీచ్ అయ్యే కంటెంట్ ఉంది. కానీ రాజమౌళి ధైర్యం చేయలేదు.

పైన చెప్పిన లిస్టులో ఉన్నటువంటి సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాకపోవడం వల్లే బాహుబలి మూవీ వచ్చే వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది.

ALSO READ:

ఆచార్య ట్రైలర్ లో కనిపించని కాజల్…సినిమాలోనూ కట్ చేశారా …?

ఎండ తీవ్ర‌త‌కు మీ శ‌రీరాన్ని యాక్టివ్‌గా మార్చే ఎన‌ర్జిటిక్ డ్రింక్ ఇదే..!

 

Visitors Are Also Reading