Home » గాలిలో తేలియాడుతున్న దేవాలయం.. రహస్యం ఇదేనా..!!

గాలిలో తేలియాడుతున్న దేవాలయం.. రహస్యం ఇదేనా..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

లేపాక్షి.. ఆంధ్ర ప్రదేశ్ అనంతపురం జిల్లాలో ఒక ప్రముఖ శైవక్షేత్రం మరియు పర్యాటక కేంద్రం. శిల్పులు చెక్కిన అందమైన ప్రాణం పోసుకుంటున్న శిల్పాలను చూస్తే అక్కడే ఉండాలనిపిస్తుంది. ఈ ఆలయానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. గాల్లో తేలుతున్న రహస్యమైన దేవాలయం ఇది. ఈ దేవాలయాన్ని చూసి శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోయారు. ఆ మిస్టరీ వెనుక ఉన్న రహస్యాన్ని కనుక్కోవడానికి చాలా తిప్పలు పడ్డారు. అయితే ఈ దేవాలయం గురించి అద్భుతమైన రహస్యాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ గుడిలోని వీరభద్ర స్వామి మండపానికి చెందిన ఓ స్తంభం గాలిలో తేలియాడుతూ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వింతలు విచిత్రాలకు నెలవు మన భారతదేశం.

అప్పట్లో రాజులు నిర్మించిన ఆలయాలు ఎంతో విచిత్రంగానూ సాంకేతికంగానూ సవాల్ చేసే విధంగా ఉంటాయనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. గాలిలో తేలియాడే స్తంభాన్ని బ్రిటిష్ వారు కూడా ఛేదించలేకపోయారు. క్రీస్తుపూర్వం 16 వ శతాబ్దంలో విజయనగర రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారు. మహాశివుడు,విష్ణుమూర్తి, వీరభద్ర స్వామిని ఇక్కడ పూజిస్తుంటారు. లేపాక్షి వీరభద్రుడి ఆలయం లోని నాట్య మండపాన్ని దాదాపు 70 స్తంభాలతో నిర్మించారు. సాధారణంగా స్తంబాలు నేలను తాగుతూ పైకప్పు ఆధారంగా ఉంటాయి. కానీ ఈ దేవాలయంలో ఉన్న ఒక స్తంభం నేలకు కొంచెం ఎత్తులో గాల్లో తేలుతూ ఉండే విధంగా నిర్మించారు.

Advertisement

Advertisement

ఈ రహస్యాన్ని ఛేదించడానికి ప్రయత్నించి చాలామంది విఫలమయ్యారు.ఆమెల్టన్ ఈ స్తంభాన్ని కిందకు అనిచ్చే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో స్థంభం పై కప్పు ఆధారంగా ఉన్న శేషాలన్ని కదిలాయి. అంతే కాకుండా మిగతా స్తంభాలు కూడా వాటి దిశను మార్చుకున్నాయి. దీంతో ఈ ఆలయ భారాన్ని మొత్తం ఈ స్థంభమే మోస్తుందని ఒక నిర్ణయానికి వచ్చి దాన్ని అలాగే వదిలేస్తాడు. దీన్ని బట్టి ఆనాటి శిల్పుల చాతుర్యం ఏమిటో తెలుసుకోవచ్చు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఆ గుడికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఈ స్తంభాన్ని అలా గాలిలో వేలాడదీశారు. అయితే ఈ స్తంభాన్ని గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా నిర్మించారని కొందరు అభిప్రాయపడ్డారు. అయితే ఈ ఆలయం రహస్యాల మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి

ALSO READ :

Acharya : ధ‌ర్మ‌స్థ‌లి పేరును ఎలా సృష్టించారో తెలుసా..?

 

అన్నమయ్య సినిమాలో బాలయ్య, శోభన్ బాబు మిస్ అయిన పాత్ర ఏంటో తెలుసా..?

 

Visitors Are Also Reading