Home » యూట్యూబ్ నుంచి టాలీవుడ్ కు వచ్చి..ఓ రేంజ్ కు వెళ్లిన స్టార్లు వీళ్లే

యూట్యూబ్ నుంచి టాలీవుడ్ కు వచ్చి..ఓ రేంజ్ కు వెళ్లిన స్టార్లు వీళ్లే

by Bunty
Ad

షార్ట్ ఫిల్మ్స్ అనేది వెండితెరకు షార్ట్‌కట్ లాంటిది. అందుకే షార్ట్ కంటెంట్ ద్వారా యూట్యూబ్‌లో ప్రూవ్ చేసుకొని సినిమా ప్రయత్నాలు చేస్తుంటారు. ఐతే షార్ట్ మూవీస్ లో హిట్ అయిన వెంటనే సినిమాలో ఆఫర్స్ వచ్చేస్తాయా అంటే అస్సలు రావు… టైమ్ పడుతుంది. అయితే, యూట్యూబ్ నుంచి టాలీవుడ్ కు వచ్చి..ఓ రేంజ్ కు వెళ్లిన స్టార్లు కూడా ఉన్నారు. వారేవవో ఇప్పుడు చూద్దాం.

Advertisement

1. నవీన్ పోలిశెట్టి – ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ

నవీన్ పొలిశెట్టి… ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాకి ముందు షార్ట్ ఫిల్మ్స్ మరియు మూవీస్ లో సైడ్ క్యారెక్టర్స్ చేశాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో స్టార్ అయ్యాడు. తరువాత జాతి రత్నాలు సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ కొట్టిన నవీన్ పోలిశెట్టి తర్వాత అనుష్క శెట్టితో కలిసి యువి క్రియేషన్స్ బ్యానర్ లో ఒక సినిమా చేస్తున్నాడు.

2. సుహాస్ – కలర్ ఫోటో

Advertisement

సుహాస్… షార్ట్ ఫిల్మ్స్ తో మంచి టాలెంటెడ్ ఆర్టిస్ట్ అని ప్రూవ్ చేసుకుని… సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేశాడు. ఇక కలర్ ఫోటో తో లీడ్ రోల్ చేసి కన్నయ్య క్యారెక్టర్ తో అందరినీ ఇంప్రెస్ చేసాడు.

3.చాందిని చౌదరి – కలర్ ఫోటో

మధురం లాంటి షార్ట్ ఫిల్మ్ ద్వారా చాందిని మన అందరికి తెలుసు. మను సినిమా ఈమె తొలిచిత్రం. ఇక కలర్ ఫోటోతో ఒక మంచి ఆర్టిస్ట్ గా నిరూపించుకుంది.

4. విశ్వక్ సేన్ – వెళ్లిపోమాకే & ఈ నగరానికి ఏమైంది

YT లో ప్రయోగాలు చేసిన విశ్వక్‌…. వెళ్లిపోమాకే, ఈ నగరానికి ఏమైంది, ఫలక్‌నుమా దాస్ మరియు పాగల్ సినిమాలు చేసాడు.

5. రాజ్ తరుణ్ – ఉయ్యాల జంపాల

యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్ ట్రెండ్ నడుస్తున్న టైమ్ లో చాలా షార్ట్ ఫిలిమ్స్ చేసిన రాజ్ తరుణ్ కి ఉయ్యాల జంపాల లాంటి డెబ్యూ ఫీచర్ ఫిల్మ్ మంచి బ్రేక్ ని ఇచ్చింది.

READ ALSO : Prabhas To PK : 2023లో అత్యధిక పారితోషికం పొందుతున్న 8 మంది తెలుగు హీరోలు

Visitors Are Also Reading