Home » చెప్పవే చిరుగాలి హీరోయిన్ మీకు గుర్తుందా ? ఇప్పుడు ఏం చేస్తుందంటే ?

చెప్పవే చిరుగాలి హీరోయిన్ మీకు గుర్తుందా ? ఇప్పుడు ఏం చేస్తుందంటే ?

by Anji

సినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు ఒకప్పుడు ఓ ఊపు ఊపిన వారు ఇప్పుడు కనుమరుగైన విషయం తెలిసిందే. కొంత మంది రీ ఎంట్రీ ఇస్తే.. మరి కొంత మంది ఆచూకి లేకుండా కనుమరుగవుతున్నారు. అలాంటి వారిలో  మీకు చెప్పవే చిరుగాలి సినిమాలో హీరోయిన్ గా నటించిన అభిరామి గుర్తుందా ? ఆమె తొట్టెంపూడి వేణుకి జోడిగా ఆ సినిమాలో నటించి అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. బుల్లితెర నుంచి తన కెరీర్ ను ప్రారంభించిన అభిరామి టెలివిజన్ వ్యాఖ్యాతగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. మలయాళం, కన్నడం, తమిళ భాషల్లో ఎక్కువ సినిమాలు చేసిన అభిరామి.. తెలుగులో మాత్రం చాలా తక్కువ చిత్రాల్లోనే నటించింది. 

Also Read :  మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం కోసం పవన్ కళ్యాణ్ అన్ని కష్టాలు పడ్డారా ? 

చెప్పవే చిరుగాలి మూవీ తరువాత ఆమె తెలుగు తెరపై మళ్లీ కనిపించలేదు. 2004లో సినిమాలకు పూర్తిగా దూరమైన అభిరామి.. తిరిగి మళ్లీ పదేళ్లకు ఓ మలయాల మూవీలో ఇండస్ట్రీకీ రీ ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. కథాపురుషన్ అనే మలయాళ సినిమాతో బాలనటిగా పరిచయం అయింది. ఇక తరువాత పత్రం, న్జంగల్, సంతుస్తరను, మెర్కారా, శ్రద్ధ,మిలినియం స్టార్స్, మెలెవర్యతే మలఖక్కుట్టికల్, మేఘసందేశం వంటి మలయాళ సినిమాలతో తనకంటూ మంచి గుర్తింపు సంపాదించింది. ఆ తరువాత కన్నడంలో కరక్తకన్నీరు, లాలిహాడు వంటి చిత్రాలు. తమిళంలో మిడిల్ క్లాస్ మాధవన్, చార్లీ చాప్లిన్, దోస్త్, కర్మేఘమం వంటి సినిమాల్లో నటించింది.  

Also Read :  నేను ఎవరి మాట విననంటూ షాకింగ్ కౌంటర్ ఇచ్చిన సిమ్రాన్..!

Manam News

తెలుగులో మాత్రం ఆమె చేసింది చాలా తక్కువ సినిమాలు మాత్రమే. వాటిలో చెప్పవే చిరుగాలి సినిమా అభిరామికి మంచి పేరు తెచ్చిపెట్టింది. దాని కంటే ముందు థాంక్యూ సుబ్బారావు, చార్మినార్ వంటి సినిమాల్లో నటించింది. ఆ తరువాత 2018లో టాలీవుడ్ కి రీ ఎంట్రీ ఇచ్చి రవితేజ హీరోగా నటించిన అమర్ అక్బర్ ఆంటోని మూవీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. నటిగా మాత్రమే కాదు.. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా అభిరామికి మంచి పేరుంది. విశ్వరూపం, విశ్వరూపం2 సినిమాల్లో హీరోయిన్ పూజ కుమార్ కు తమిళంలో డబ్బింగ్ చెప్పింది. తాజాగా అభిరామి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Also Read :  ఆ విషయం లో సపోర్ట్ చెయ్యనందుకే విజయశాంతి- చిరు మధ్య 20 ఏళ్ళు మాటలు లేవా ?

Visitors Are Also Reading