Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » నేను ఎవరి మాట విననంటూ షాకింగ్ కౌంటర్ ఇచ్చిన సిమ్రాన్..!

నేను ఎవరి మాట విననంటూ షాకింగ్ కౌంటర్ ఇచ్చిన సిమ్రాన్..!

by Sravanthi Pandrala Pandrala
Ads

ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన నటనతో అందచందాలతో ఇండస్ట్రీనే షేక్ చేసిన అందాల ముద్దుగుమ్మ సిమ్రాన్. ఆమె ఇండస్ట్రీలో ఉన్నటువంటి మధ్యతరం నటులైన చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున వంటి స్టార్ హీరోలు అందరితో తెరను పంచుకుంది. అప్పట్లో సిమ్రాన్ సినిమాలో హీరోయిన్ గా ఉంది అంటే థియేటర్లన్నీ జనాలతో నిండిపోయేవి అంతటి స్టార్డం సంపాదించుకున్న సిమ్రాన్ పూర్తిస్థాయి తన కెరీర్ ను ఇండస్ట్రీలో కొనసాగించలేకపోయింది. కెరియర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది.

Advertisement

also read:బిగ్ బాస్ ఫేమ్ మెహబూబ్ కొత్త కారు..ఎన్ని లక్షలంటే..?

Ad

Advertisement

అలాంటి ఈమె టాప్ పొజిషన్లో హీరోయిన్ గా ఉన్నప్పటికీ ఐటెం సాంగ్స్ చేస్తూ జనాలను మెప్పించిందని చెప్పవచ్చు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన సిమ్రాన్ పలు షాకింగ్ కామెంట్స్ చేసింది.. నా జీవితానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం అయినా నాదే.. ఎవరి సలహాలు నాకు నచ్చవు.. దీనికి కూడా ఒక కారణం ఉంది.. ఒక సమయంలో హీరో విజయ్ సినిమాలో స్పెషల్ సాంగ్ ఆఫర్ వచ్చింది. కానీ ఆ సాంగ్ చేయొద్దని నాకు చాలామంది సలహాలు ఇచ్చారు. కానీ ఎవరి మాట నేను పట్టించుకోలేదు.

also read:సిల్క్ స్మిత చనిపోయినప్పుడు వెళ్లిన ఒకే ఒక్క హీరో ఎవరో తెలుసా..?

చివరికి ఆ సాంగ్ చేశాను సూపర్ హిట్ అయింది. ఒకవేళ ఇతరుల మాటలు విని నేను సాంగ్ చేయకుండా ఉండి ఉంటే అంత మంచి హిట్ వచ్చేది కాదు కదా అంటూ చెప్పుకొచ్చింది. ఎవరికైనా సొంతంగా నిర్ణయాలు తీసుకొని సక్సెస్ అవుతామనే నమ్మకం ఉంటే తప్పకుండా చేయాలని ఆమె తెలియజేసింది. ప్రస్తుతం ఆమె చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

also read:బాలకృష్ణ సినిమాల్లో ధరించే విగ్ ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..?

Visitors Are Also Reading