పెళ్లంటే మూడు ముళ్ళు, ఏడు అడుగులు. ప్రస్తుతం పెళ్లిళ్ల విధానం మారింది. యువతి, యువకుల్లో ఎంతో మార్పు వచ్చింది. జీవితంలో సెట్ అయితే కానీ పెళ్లి వైపు చూడడం లేదు. ఒకప్పటి బాల్యవివాహాలకు చాలావరకు అడ్డుకట్ట పడిందని చెప్పవచ్చు. రిజిస్టర్ ఆఫ్ జనరల్ ఇండియా కార్యాలయం వివాహ వయసులపై జరిపినటువంటి జాతీయ సర్వేలో దేశవ్యాప్తంగా మహిళల సగటు వివాహ వయసు 22.7 ఏలుగా వెళ్లడైంది. 2020లో ఈ సర్వే జరిపినప్పటికీ విశ్లేషణ కాస్త ఆలస్యమైంది. దానికి సంబంధించిన వివరాలను తాజాగా విడుదల చేసింది ఈ సంస్థ.
Advertisement
Also Read:దర్శకుడు సుకుమార్ పై IT దాడులు.. ఆ MLAలు కారణమని మీకు తెలుసా..?
ఈ సర్వే తెలిపిన గణాంకాల ప్రకారం 2017 నాటికి దేశంలో యువతుల వివాహ సగటు వయస్సు 21.1సంవత్సరాలు. 2020 నాటికి అది 22.7 ఏళ్లకు చేరుకుంది. ఆయా రాష్ట్రాల సంస్కృతి సాంప్రదాయాలు మహిళల వివాహం పై ఆధారపడి ఉంటాయి. ఇక ఇందులో తెలంగాణ గణాంకాలను పరిశీలిస్తే పట్టణ ప్రాంతాల్లో 24.3సంవత్సరాలు, గ్రామీణ ప్రాంతాల్లో 22.8 సంవత్సరాలుగా తేలింది. అంటే సగటున 23.5 ఏళ్లకు తెలంగాణ యువతులు పెళ్లి చేసుకుంటున్నారని జాతీయ నమూనా సర్వే వెల్లడించింది.
Advertisement
Also Read:రాఘవేంద్రరావు పాటల్లో పండ్లు, పూలు వాడటం వెనుక అసలు సీక్రెట్ ఇదేనా..?
దక్షిణ తెలంగాణతో పాటు తమిళనాడు మహిళలకు కూడా కాస్త ఆలస్యంగా వివాహాలు అవుతున్నాయని సర్వేలో వెళ్లడైంది. ఇంకోవైపు దేశంలో కాశ్మీర్ మహిళలు 26 ఏళ్లకు వివాహం చేసుకుంటుండగా, జార్ఖండ్, పశ్చిమబెంగాలకు చెందిన మహిళలు 21 ఏళ్లలోపే పెళ్లి చేసుకుంటున్నారట. ప్రస్తుతం దేశంలో మహిళల కనీస వివాహ వయస్సు 18 ఏళ్లుగా ఉండగా దాని పురుషుల చట్టబద్ధ కనీస వివాహ వయసు 21 ఏళ్లకు సమానంగా పెంచాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.
Also Read:పెళ్లయి 5 నెళ్లు కాలేదు.. అంతలోనే అనంత లోకాలకు.. అంత దారుణం జరిగిందా..?