తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం విధితమే. ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు కీలక సమాచారం అందించింది. పోలీస్ పరీక్షల తేదీలను బోర్డు అధికారికంగా ప్రకటించింది. ఈ పరీక్షలను రెండు దఫాలుగా నిర్వహిస్తున్నట్టు రిక్రూట్మెంట్ బోర్డు వెల్లడించింది. ఆగస్టు 07, 21వ తేదీల్లో పరీక్షలను నిర్వహించనున్నట్టు వెల్లడించారు.
ఆగస్టు 07వ తేదీన ఎస్సై రాత పరీక్ష, 21న కానిస్టేబుల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్ష ప్రిలిమ్స్ హాల్ టికెట్లను www.tslprb.in వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జులై 30 నుంచి ఎస్సై, ఆగస్టు 10 నుంచి కానిస్టేబుల్ అభ్యర్థులు హాట్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునేందుకు అందుబాటులో ఉంటాయని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు తెలిపింది. ఈ పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం01 గంటల నిర్వహించనున్నట్టు బోర్డు తెలిపింది.
Advertisement
Advertisement
తెలంగాణ సర్కారు మొత్తం 80,039 పోస్టులను భర్తీ చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసినదే. ఇందుఓ 17,291 పోస్టలు భర్తీకి తెలంగాణ స్టేట్ లేవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ ఈ ఏడాది ఏప్రిల్ 28న నోటిఫికేషన్‌లను జారీ చేసింది. ఆయా నోటిఫికేషన్ల ద్వారా మొత్తం 17,291 పోస్టులను భర్తీ చేస్తోంది. ఇందులో 554 ఎస్సై పోస్టులు, 15644 కానిస్టేబుల్ పోస్టులు, 614 పొహిబిషన్ ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎస్ఐ పోస్టులకు 2.45 లక్షల మంది, కానిస్టేబుల్ పోస్టులకు 6.5 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష తేదీలను వెల్లడించడంతో అభ్యర్థులు హైదరాబాద్ నగరానికి చాలా మంది బయలుదేరారు.
Also Read :
పొన్నియిన్ సెల్వన్ నుంచి మరో కొత్త లుక్.. విక్రమ్ ఎలా ఉన్నారంటే..?
నరేష్ పవిత్ర లోకేష్ ల పై శ్రీరెడ్డి ఓ రేంజ్ లో ఫైర్… తాట తీస్తా అంటూ….!