Home » నరేష్ పవిత్ర లోకేష్ ల పై శ్రీరెడ్డి ఓ రేంజ్ లో ఫైర్… తాట తీస్తా అంటూ….!

నరేష్ పవిత్ర లోకేష్ ల పై శ్రీరెడ్డి ఓ రేంజ్ లో ఫైర్… తాట తీస్తా అంటూ….!

by AJAY
Ad

వివాదాస్పద నటి శ్రీరెడ్డి టాలీవుడ్ కు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ శ్రీరెడ్డి యూట్యూబ్, సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. అంతేకాకుండా శ్రీరెడ్డి తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ మరియు సినిమా విషయాలపై తనదైన‌ స్టైల్ లో స్పందిస్తూ ఉంటుంది. రీసెంట్ గా పవిత్ర లోకేష్ నరేష్ ల వ్య‌వ‌హారం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఇక ఆదివారం పవిత్ర లోకేష్ నరేష్ మైసూర్ లోని ఒక హోటల్ లో ఉండగా నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి అక్కడి చేరుకుని వారిపై దాడి చేసేందుకు ప్రయత్నించింది.

Advertisement

అయితే తాజాగా ఈ విషయంపై స్పందిస్తూ శ్రీ రెడ్డి ఓ వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో నరేష్ పవిత్ర లోకేష్ లపై శ్రీ రెడ్డి ఓ రేంజ్ లో ఫైర్ అయింది. నరేష్ భార్య విషయంలో కలగజేసుకునేందుకు నువ్వు ఎవరు…? ఆమె క్యారెక్టర్ గురించి మాట్లాడేందుకు నువ్వు ఎవరు..? ఆమెకు మాట్లాడే స్వేచ్ఛ ఉంది. అంటూ పవిత్ర లోకేష్ ను ప్రశ్నించింది. ఇతరుల‌ జీవితాల్లో ఎందుకు నిప్పులు పోస్తున్నావంటూ ఫైర్ అయ్యింది. నువ్వు ఎవరితో అయినా రిలేషన్ షిప్ పెట్టుకోవచ్చు కానీ మీటూ ఉద్యమం గురించి మేము మాట్లాడితే మాకు వ్యతిరేకంగా మాట్లాడావంటూ మండిపడింది.

Advertisement

నరేష్ కూడా నన్ను మా అసోసియేషన్ నుండి నాలుగేళ్లు బ్యాన్ చేశాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. నరేష్ నలుగురు ఐదుగురితో అపవిత్ర బంధాలు పెట్టుకోవచ్చు ఆయన గురించి ఎన్ని చెప్పినా తక్కువే అంటూ మండిపడింది. మీటూ ఉద్యమానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు రోడ్డున పడి ఏడుస్తున్నారంటూ ఆరోపించింది. వాళ్లు దేంట్లో కూడా సక్సెస్ అవ్వలేకపోతున్నారని చెప్పుకొచ్చింది.

తన మీద కక్ష తీర్చుకోవాలని అనుకున్న వాళ్ల సినిమాలన్నీ ఫ్లాప్ అవుతున్నాయి అంటూ శ్రీరెడ్డి ఆరోపించింది. చాలామంది తనను పైకి రానీయకుండా అడ్డుకున్నారని తనను అడ్డుకున్న వాళ్ళందరూ నాశనం అయిపోవాలని శాపనార్థాలు పెట్టింది. తాను ఎంతో ఇబ్బంది పడ్డానని ఎన్నిసార్లు కన్నీళ్లు పెట్టుకున్నానో తనకే తెలియదని చెప్పుకొచ్చింది. మూడు సంవత్సరాలు తాను నరకం అనుభవించాన‌ని చెప్పింది. పైకి గ్లామర్ గా కనిపిస్తున్నా ఎంతో బాధపడ్డారని తెలిపింది. కర్మ ఎవరిని వదిలిపెట్టదని కచ్చితంగా అనుభవించి తీరుతారని శ్రీ రెడ్డి వ్యాఖ్యానించింది.

ALSO READ : డాడి సినిమాలో చిరంజీవి కూతురు గుర్తుందా..? ఇప్పుడు ఎంత అందంగా ఉందో చూడండి…!

Visitors Are Also Reading