Home » పొన్నియిన్ సెల్వ‌న్ నుంచి మ‌రో కొత్త లుక్‌.. విక్ర‌మ్ ఎలా ఉన్నారంటే..?

పొన్నియిన్ సెల్వ‌న్ నుంచి మ‌రో కొత్త లుక్‌.. విక్ర‌మ్ ఎలా ఉన్నారంటే..?

by Anji
Ad

సినీ ఇండ‌స్ట్రీలో టాప్ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఆయ‌న ఎన్నో హిట్ సినిమాలు తీసి గొప్ప పేరునే సంపాదించారు. ముఖ్యంగా ఆయ‌న సినిమాలు చాలా గ్యాబ్‌తో వ‌స్తుంటాయి. ఒక సినిమాకు మ‌రొక సినిమాకు గ్యాప్ తీసుకున్న‌ప్ప‌టికీ ప్ర‌త్యేకంగా ఆయ‌న సినిమాలు ప్రేక్ష‌కులు ఎప్ప‌టికీ గుర్తుండిపోతాయి. తాజాగా మ‌ణిర‌త్నం తెర‌కెక్కిస్తున్న సినిమా పొన్నియ‌న్ సెల్వ‌న్‌. చియాన్ విక్ర‌మ్‌, జ‌యం ర‌వి, కార్తీ, ఐశ్వ‌ర్య‌రాయ్, త్రిష ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టిస్తున్నారు. ఇక భారీ బ‌డ్జెట్ హిస్టారిక‌ల్ ఎపిక్ మూవీగా పొన్నియిన్ సెల్వ‌న్ తెర‌కెక్కిస్తున్నారు.

Advertisement

ప్ర‌పంచ వ్యాప్తంగా సెప్టెంబ‌ర్ 30న భారీ ఎత్తున విడుద‌ల చేసేందుకు ప్ర‌ణాళిక ర‌చిస్తున్నారు. ఈ సినిమా నుంచి వ‌చ్చే అప్‌డేట్ కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి కొన్ని పోస్ట‌ర్లు, క్యారెక్ట‌ర్ లుక్స్‌ విడుద‌ల చేశారు. తాజాగా సినిమా నుంచి విక్ర‌మ్ లుక్ విడుద‌ల చేశారు. ఈ చిత్రంలో విక్ర‌మ్ ఆదిల్య క‌రికాల‌న్ అనే రాజుగా ద‌ర్శ‌నం ఇవ్వ‌నున్నారు. విజ‌య ద‌ర‌హాసంతో గుర్రంపై ఠీవిగా విక్ర‌మ్ కూర్చున్న పోస్ట‌ర్ నువిడుద‌ల చేశారు. విడుద‌ల చేసిన కొద్ది సేప‌టికే సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది.

Advertisement

ఈ చిత్రాన్ని లైకా ప్రొడ‌క్ష‌న్స్‌, మ‌ద్రాస్ టాకీస్ ప‌తాకాల‌పై మ‌ణిర‌త్నం, అలీరాజా సుభాస్క‌ర‌న్ నిర్మాతలుగా రూపొందుతున్న భారీ బ‌డ్జెట్ సినిమా పొన్నియిన్ సెల్వ‌న్‌. భారీ నిర్మాణ విలువ‌ల‌తో హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో రెండు పార్ట్‌లుగా ఈ చిత్రం రూపొందిస్తున్నారు. మొద‌టి పార్ట్ పొన్నియిన్ సెల్వ‌న్ 1, సెప్టెంబ‌ర్ 30న భారీ ఎత్తున విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్న‌ట్టు మేక‌ర్స్ అనౌన్స్ చేశారు. ఈ చిత్రంలో ఇప్ప‌టివ‌ర‌కు విడుద‌ల చేసిన ఒక్కో లుక్ ఒక్కో విదంగా డిఫ‌రెంట్‌గా ఆక‌ట్టుకుంటోంది. ఆస్కార్ అవార్డు గ్ర‌హీత ఏ.ఆర్.రెహ‌మాన్ ఈ చిత్రాన్ని మ్యూజిక్ అందిస్తున్నారు.

Also Read : 

ఫేస్‌బుక్ లైవ్‌లో ఏడ్చేసిన శ్రీ‌రెడ్డి.. మెగా ఫ్యామిలీపై మ‌రోసారి ఫైర్‌..!

 

Visitors Are Also Reading