తెలంగాణ పాలిసెట్-2023 నోటిఫికేషన్ (జనవరి 10)న విడుదలైంది. 2023-24 విద్యా సంవత్సరానికి గాను పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు తాజాగా ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆన్లైన్ విధానంలో జనవరి 16 నుంచి ఏప్రిల్ 24 వరకు ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులతో పాటు ఈ ఏడాది పరీక్షలు రాయబోతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. పాలిసెట్ 2023 పరీక్ష మే 17న నిర్వహిస్తామని కన్వీనర్ డాక్టర్ శ్రీనాథ్ తెలిపారు.
Advertisement
విద్యార్హతలు
Advertisement
ప్రస్తుతం పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కంపార్ట్మెంటల్ పద్ధతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈసారి బాసర ఆర్జీయూకేటి ఈ పరీక్షలో చేరడం లేదు. పాలిసెట్ ద్వారా డిప్లమా ఇన్ ఇంజనీరింగ్, వెటర్నరీ, హార్టికల్చర్, అగ్రికల్చర్ డిప్లమా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. పరీక్ష నిర్వహించిన 10 రోజుల్లో ఫలితాలు వెల్లడించనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఫీజు పెంపు, పాలిటెక్నిక్ డిప్లమా కోర్సులో ప్రవేశాలకు మే 17న నిర్వహించనున్న పాలిసెట్-2023 దరఖాస్తు ఫీజు స్వల్పంగా పెంచారు. జనరల్, బీసీ విద్యార్థులకు ఇప్పటివరకు రూ. 450 ఉండగా, దాన్ని రూ. 500 కు పెంచారు. ఎస్సి, ఎస్టీ విద్యార్థులకు గతంలో మాదిరిగానే రూ. 250 రుసుమే ఉంది.
మరిన్ని వివరాలకు, https://polycet.sbtet.telangana.gov.in/ వెబ్సైటును సందర్శించవచ్చు.
read also : రోజా పై విరుచుకుపడిన చిరంజీవి..మొన్న నా ఇంటికి వచ్చి ఈ రోజు నా వెనుక చేరి !