Telugu News » Blog » రోజా పై విరుచుకుపడిన చిరంజీవి..మొన్న నా ఇంటికి వచ్చి ఈ రోజు నా వెనుక చేరి !

రోజా పై విరుచుకుపడిన చిరంజీవి..మొన్న నా ఇంటికి వచ్చి ఈ రోజు నా వెనుక చేరి !

by Bunty
Ads

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ రవితేజ కలిసి నటిస్తున్న చిత్రం వాల్తేరు వీరయ్య. దర్శకుడు బాబి తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. ఇందులో మెగాస్టార్ సరసన శృతిహాసన్ నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఆల్బమ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. వాల్తేరు వీరయ్య జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.

Advertisement

ఈ క్రమంలోనే తన సినిమా ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న చిరు,పలు ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చిరు మాట్లాడుతూ, మంత్రి రోజా వ్యాఖ్యలపై స్పందించారు. ఆమె మాటలపై తాను ఎలాంటి కామెంట్ చేయనని, గతంలో తనతో కలిసి పలు చిత్రాల్లో నటించాలని, తనతో పాటు సెంటిమెంట్ కూడా పంచుకున్నానని అన్నారు. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంకు తో పాటు, కరోనా సమయంలో సినీ కార్మికుల కోసం చేసిన సాయం ఇవన్నీ తన హెల్పింగ్ నేచర్ కు నిలువెత్తు సమాధానాలు అని, ఆమె అన్న మాటలకు తను ఆన్సర్ ఇస్తే తన స్థాయిని తగ్గించుకున్నవాడిని అవుతానని అన్నారు.

Advertisement

ఆమె మంత్రి అయ్యాక కూడా తన ఇంటికి వచ్చారని, అక్కడే భోజనం కూడా చేశారని, ఎప్పుడు సొంత మనుషుల్లా తిరిగారని అన్నారు. వాళ్ల మెంటాలిటీ, నైజాం ప్రకారం మాట్లాడేస్తే, నేను స్పందించి మాట్లాడడం నా నైజాం కాదని, వాళ్ళు ఏం మాట్లాడినా వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు. కొంతమందికి నా పేరు వాడకపోతే గుర్తింపు కూడా ఉండదు. నా ఫ్యామిలీ గురించి తప్పుగా మాట్లాడతారు. మళ్ళీ నా దగ్గరికి వస్తారు. మళ్లీ నన్నే అంటారు. నేను ఏ సహాయం చేయలేదు అని మాట్లాడతారు. నేను ఎవరెవరికి సహాయం చేశాను నా మనసుకి తెలుసు అని చిరంజీవి వాక్యానించారు. కాగా ఇటీవల మెగా ఫ్యామిలీ పై రోజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మెగా బ్రదర్స్ తమ సొంత నియోజకవర్గాల్లోనే గెలవలేదంటూ ఎద్దేవా చేశారు రోజా.

Advertisement

READ ALSO : ఈనెల 18న ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య ఉప్పల్ లో మ్యాచ్.. ఈసారి ఆన్‌లైన్‌లోనే టికెట్లు.. వివరాలు ఇవే