తెలంగాణ అమరవీరుల స్మారకం ప్రారంభోత్సవానికి ముహుర్తం ఫిక్స్ అయింది. జూన్ మాసంలో తెలంగాణ రాష్ట్ర సీఎం కేసిఆర్ చేతుల మీదుగా తెలంగాణ అమరవీరుల స్మారకం ప్రారంభోత్సం కానుంది. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.తెలంగాణ అమరవీరుల త్యాగాలు ప్రతిబింబించేలా.. ముఖ్యమంత్రి కేసిఆర్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ నగర నడి బొడ్డున,హుస్సేన్ సాగర్ తీరాన ఈ నిర్మాణం చేపట్టారని అన్నారు.
READ ALSO : Ramabanam Review: ‘రామబాణం’ రివ్యూ.. గోపిచంద్ సాలిడ్ కంబ్యాక్
Advertisement
అరుదైన స్టెయిన్ స్టీల్ తో అన్ని రకాల అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో,సకల హంగులతో స్మారకాన్ని నిర్మించామని తెలిపారు. ప్రపంచంలోనే అరుదైన స్టెయిన్ లెస్ స్టీల్ తో నిర్మించిన అతిపెద్ద కట్టడం ఇదేనని అన్నారు. ఈ నిర్మాణం పూర్తి అయి అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచమే అబ్బురపడి చూస్తుందని చెప్పారు. స్మారక ప్రాంగణానికి ఎవరు వచ్చినా అమరవీరుల త్యాగాలు గుర్తు చేసుకునే విధంగా ఈ నిర్మాణంలో ఏర్పాట్లు ఉండబోతున్నాయని అన్నారు.
Advertisement
READ ALSO : “వయసు”తో సంబంధం లేకుండా పెళ్లి చేసుకున్న టీమిండియా క్రికెటర్స్…!
ఇది పూర్తిగా యావత్ తెలంగాణ ప్రజల హృదయాలను హత్తుకునే కట్టడమని ప్రతి ఒక్కరూ మనసుపెట్టి పనిచేయాలని అధికారులను,వర్క్ ఏజెన్సీని కోరారు. ల్యాండ్ స్కేప్ ఏరియాలో పచ్చదనానికి ప్రాముఖ్యతనివ్వాలన్నారు.ఆహ్లాదకరమైన రంగురంగుల పూల మొక్కలు ఏర్పాటు చేయాలని సూచించారు. నిర్మాణ ఫినిషింగ్ పనుల్లో వేగం పెంచాలని,పర్ట్ చార్ట్ ప్రకారం పనులు పూర్తి చేసి కేసిఆర్ గారు విధించిన నిర్ణీత గడువులోగా ప్రారంభానికి సిద్దం చేయాలని అదేశించారు. అందుకు తగ్గట్టుగా మ్యాన్ పవర్ పెంచాలని సూచించారు.
READ ALSO : అఖిల్ వల్ల భారీ ప్రమాదం నుంచి తప్పించుకున్న చరణ్..!