Home » ఎంసెట్‌, ఈసెట్ మాత్రం జూన్‌లో.. మిగిలిన 5 ప్ర‌వేశ ప‌రీక్ష‌లు ఎప్పుడంటే..?

ఎంసెట్‌, ఈసెట్ మాత్రం జూన్‌లో.. మిగిలిన 5 ప్ర‌వేశ ప‌రీక్ష‌లు ఎప్పుడంటే..?

by Anji
Ad

తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్‌, ఈసెట్ ప‌రీక్ష‌లు మాత్రం జూన్ నెల చివ‌రిలో నిర్వ‌హించ‌నున్నారు. మిగిలిన 5 ప్ర‌వేశ‌పరీక్ష‌ల‌ను జులైలో జ‌రుప‌నున్నారు. ఈ మేర‌కు తెలంగాణ రాష్ట్ర ఉన్న‌త విద్యామండ‌లి ప్రాథ‌మికంగా ఓ నిర్ణ‌యానికి వ‌చ్చింది. ఇంట‌ర్మీడియ‌ట్ ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు ప‌రీక్ష‌లు మే 07తో ముగియ‌నున్నాయి. ఇక పాలిటెక్నిక్ డిప్లోమా విద్యార్థుల చివ‌రి ప‌రీక్ష‌లు జూన్ మొద‌టి వారంలో పూర్తి కానున్నాయి. ఈ త‌రుణంలో జూన్ నెలాఖ‌రులో ఎంసెట్‌, ఈసెట్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన‌ది.

Advertisement

Advertisement

ఆ త‌రువాత ఐసెట్, ఎడ్‌సెట్, పీఈసెట్, పీజీ ఇంజినీరింగ్, లాసెట్‌ల‌ను జులై నెల‌లో చేప‌ట్టాల‌ని ప్రాథ‌మికంగా నిర్ణ‌యించారు. జూన్‌లో వారికి చివరి సెమిస్ట‌ర్ ప‌రీక్ష‌లు జ‌రుగుతాయి. జులైలో 10 రోజుల స‌మ‌యం ఇచ్చి ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని అధికారులు నిర్ణ‌యించారు. రేప‌టి నుంచి ఎంసెట్‌, ఐసెట్, ఈసెట్ క‌మిటీ స‌మావేశాలు జ‌రుగ‌నున్నాయి. 9వ తేదీన పీజీఈసెట్, లాసెట్ క‌మిటీ స‌మావేశాలు 10వ తేదీన ఎడ్‌సెట్ క‌మిటీ స‌మావేశం జ‌రుగ‌నున్న‌ది. 11వ తేదీన పీఈసెట్ స‌మావేశం నిర్వ‌హించాల‌ని భావిస్తున్నారు. ఆయా ప్ర‌వేశ ప‌రీక్ష‌ల తేదీల‌పై ఇంకా క్లారిటీ రాలేదు.

Also Read :  IND vs SL : రోహిత్‌, ద్ర‌విడ్‌ల త‌ప్పేమి లేదు.. క్లారిటీ ఇచ్చిన జ‌డేజా..!

Visitors Are Also Reading