జనవరి 04 న తెలంగాణ మంత్రివర్గం భేటీ కానుంది. రాష్ట్ర బడ్జెట్ సమావేశాల నిర్వహణతో పాటు కాంగ్రెస్ ప్రకటించిన ఆరుగ్యారెంటీల్లోని రెండు పథకాల అమలుపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ భేటీలోనే రాష్ట్ర బడ్జెట్ సమావేశాల నిర్వహణ తేదీని అధికారికంగా నిర్ణయించే అవకాశం ఉంది. ఈనెల 8వ తేదీ నుంచి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర సర్కార్ యోచిస్తోంది. 9వ తేదీన గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చేయనున్నారు.
ఇక10వ తేదీన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. 11వ తేదీ ఆదివారం సెలవు దినం వదిలేస్తే…12వ తేదీ నుంచి 5రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర సర్కార్ భావిస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే మెరుగ్గా ఆచితూచి బడ్జెట్ ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోందట. ముఖ్యంగా ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క కి బడ్జెట్ మీద మంచి గ్రిప్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపు ఎలా ఉంటుందోననే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రజలు చూడాలి మరీ.
మరిన్నీ తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!