Home » IND Vs SL: మొహ‌లీలో టీమిండియా డిక్లెర్డ్‌.. జ‌డేజా రికార్డు..!

IND Vs SL: మొహ‌లీలో టీమిండియా డిక్లెర్డ్‌.. జ‌డేజా రికార్డు..!

by Anji
Ad

మొహ‌లీ వేదిక‌గా శ్రీలంక‌తో రెండు రోజుల నుంచి భార‌త్ బ్యాటింగ్ చేస్తోంది. తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ను 574 8 స్కోరు వ‌ద్ద డిక్లెర్ చేసింది. స్టార్ ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా భారీ సెంచ‌రీ చేశాడు. 175 ప‌రుగుల‌తో నాటౌట్‌గా నిలిచాడు. అయితే డ‌బుల్ సెంచ‌రీకి జ‌డేజా 25 ప‌రుగుల దూరంలో ఉన్న స‌మ‌యంలో ఇన్నింగ్స్‌ను కెప్టెన్ రోహిత్ శ‌ర్మ డిక్లెర్డ్ చేశాడు. దీంతో అక్క‌డే వివాదం చెల‌రేగింది. కెరీర్‌లో జ‌డేజా తొలిసారి డ‌బుల్ సెంచ‌రీ చేసే అవ‌కాశం ఉన్న‌ప్పుడు రోహిత్ ఇన్నింగ్స్ ఎలా డిక్లేర్ చేస్తాడ‌ని కొంద‌రూ అభిమానులు ప్ర‌శ్నిస్తున్నారు.

Also Read :  యుద్దం ఆపేసిన రష్యా.. అందుకోస‌మేనా..?

Advertisement

Advertisement

ఇదివ‌ర‌కు పాకిస్తాన్ గ‌డ్డ‌పై 2004లో జ‌రిగిన టెస్ట్ సిరీస్‌లో కూడా ఇలాంటి సీన్ జ‌రిగింద‌నే చెప్ప‌వ‌చ్చు. సెహ్వాగ్ (309)తో పాక్ గ‌డ్డ‌పై ట్రిపుల్ సెంచరీ చేసిన ఏకైక బ్యాట్స్‌మ‌న్‌గా రికార్డు సృష్టించాడు. అదే మ్యాచ్‌లో స‌చిన్ కూడా 194 ప‌రుగుల వ‌ద్ద ఉండ‌గా.. ద్ర‌విడ్ డిక్లేర్డ్ అని ప్ర‌క‌టించాడు. ఈ అంశంపై అప్ప‌ట్లో పెద్ద వివాద‌మే రేగింది.

రిష‌బ్‌పంత్‌, ర‌విచంద్ర‌న్ అశ్విన్‌, మ‌హ్మ‌ద్ ష‌మీల‌తో కిసి ఆరు, ఏడో, 9వ వికెట్ల‌కు 100 ప‌రుగుల‌కు పైగా భాగ‌స్వామ్యాలు నెల‌కొల్పిన ఆట‌గాడిగా ర‌వీంద్ర జ‌డేజా నిలిచాడు. ఈ ఫీట్ సాధించిన ఐద‌వ భార‌త బ్యాట్స్‌మెన్ రికార్డు సాధించాడు. గ‌తంలో వినోద్ కాంబ్లీ, రాహుల్ ద్ర‌విడ్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, క‌రణ్ పేరిట ఈ ఫీట్ న‌మోదు అయి ఉంది.

Also Read :  వివాద‌స్ప‌దం.. అనంత‌పురం జిల్లాలో కేంద్ర మంత్రి నిర్మ‌ల ప‌ర్య‌ట‌న‌..!

Visitors Are Also Reading