Home » యుద్దం ఆపేసిన రష్యా.. అందుకోస‌మేనా..?

యుద్దం ఆపేసిన రష్యా.. అందుకోస‌మేనా..?

by Anji
Ad

ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధ ఇవాల్టితో 10రోజుల‌కు చేరుకున్న‌ది. యుద్ధానికి ర‌ష్యా బ్రేక్ ఇచ్చింది. తాత్కాలికంగా యుద్ధానికి బ్రేకు ఇస్తూ.. ర‌ష్యా నిర్ణ‌యం తీసుకుంది. ఉక్రెయిన్ పై కాల్పుల విర‌మ‌ణ ప్ర‌క‌టించింది. ప్ర‌పంచ దేశాల ఒత్తిడితో నిర్ణ‌యం తీసుకుంది. ఇవాళ ఉద‌యం 11.30 గంట‌ల ఉంచి ఐదున్న‌ర గంట‌ల వ‌ర‌కు కాల్పుల విర‌మ‌ణ ప్ర‌క‌టించింది. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన విదేశీయుల‌ను త‌ర‌లించేందుకు కాల్పులు విర‌మ‌ణ ప్ర‌క‌టించిన‌ది. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన విదేశీయుల‌ను త‌ర‌లించేందుకు కాల్పులు విర‌మ‌ణ ప్ర‌క‌టించాల‌ని ప్ర‌పంచ దేశాలు ర‌ష్యాను కోరాయి.

Also Read :  ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న సినిమాల్లో స్వ‌యంగా పాడిన 8 పాటలు!

Advertisement

Advertisement

ఈమేర‌కు ర‌ష్యా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టుగా తెలుస్తోంది. భార‌త్ కూడా రష్యాను ప‌లుమార్లు కోరింది. ర‌ష్యా తూర్పు ప్రాంతంలో భార‌తీయ విద్యార్థులు కూడా చిక్కుకుపోయారు. కీవ్‌, ఖ‌ర్కీవ్‌, సుమీ న‌గ‌రాల్లో ఇప్ప‌టికీ 2వేల నుంచి 3వేల వ‌ర‌కు భార‌తీయులు చిక్కుకుపోయారు. వీరంద‌రినీ ర‌ష్యా ఇచ్చిన గ‌డువులోగా ఉక్రెయిన్ స‌రిహ‌ద్దులు దాటించాల్సిన అవ‌స‌ర‌ముంది. ఇదిలా ఉండ‌గా.. క‌ల్లోలిత తూర్పు ప్రాంతాల నుంచి ప‌శ్చిమ ప్రాంతాల పోలాండ్‌, రొమేనియా, హంగేరి స‌రిహ‌ద్దుల‌కు వెళ్లాలంటే.. దాదాపు 10 గంట‌ల స‌మ‌యం ప‌డుతుంది.

ప్ర‌స్తుతం ర‌ష్యా ఇచ్చిన స‌మ‌యంలో తూర్పు నుంచి ప‌శ్చిమ ప్రాంతాల‌కు వెళ్లేందుకు స‌మ‌యం దొరికింది. ఇప్ప‌టికే ర‌ష్యా ప‌లు బ‌స్సుల‌ను ఏర్పాటు చేసింది. కాల్పుల విర‌మ‌ణ ప్ర‌క‌టించాల‌ని గ‌త కొద్ది రోజులుగా భార‌త్ రిక్వెస్ట్ చేసింది. దీనికి ర‌ష్యా కూడా భార‌త్ అభ్య‌ర్థ‌న‌కు సానుకూలంగా స్పందించి ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. దీనికి తోడు యూఎన్ఓ, మాన‌వ హ‌క్కుల సంఘం అభ్య‌ర్థ‌న‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని ర‌ష్యా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ది.

Also Read :  Video Viral : రాత్రి వేళ రైల్వే స్టేష‌న్‌లో ప‌ర్య‌టించిన ప్ర‌ధాని.. ఎందుకో తెలుసా..?

Visitors Are Also Reading