Telugu News » Blog » వివాద‌స్ప‌దం.. అనంత‌పురం జిల్లాలో కేంద్ర మంత్రి నిర్మ‌ల ప‌ర్య‌ట‌న‌..!

వివాద‌స్ప‌దం.. అనంత‌పురం జిల్లాలో కేంద్ర మంత్రి నిర్మ‌ల ప‌ర్య‌ట‌న‌..!

by Anji
Ads

అనంత‌పురం జిల్లాలో కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ప‌ర్య‌ట‌న తీవ్ర వివాద‌స్ప‌దంగా మారింది. అధికారులు, పోలీసులు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై తీవ్ర విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఓవైపు జిల్లాలోని ఎంపీలు, మంత్రి, ఎమ్మెల్యేల‌కు ఆహ్వానించ‌కుండా అవ‌మానించారు. క‌నీసం ప్రోటోకాల్ కూడా పాటించ‌లేదు.

Ads

Also Read :  Video Viral : రాత్రి వేళ రైల్వే స్టేష‌న్‌లో ప‌ర్య‌టించిన ప్ర‌ధాని.. ఎందుకో తెలుసా..?

Ads

ఇది ఇలా ఉండ‌గా.. నాసిన్ సంస్థ‌కు భూములు ఇచ్చిన రైతుల‌ను ముంద‌స్తుగా అరెస్ట్ చేశారు. న‌ష్ట‌ప‌రిహారం కోసం 2 రోజుల నుంచి ప‌రిశ్ర‌మ ముందు భూమి కోల్పోయిన రైతులు ఆందోళ‌న చేస్తున్నారు. అయితే వీరు మంత్రి ప‌ర్య‌ట‌న‌ను అడ్డుకుంటార‌న్న నేప‌థ్యంలో ముంద‌స్తుగా అరెస్ట్‌లు చేశారు.

Ad

పోలీసుల తీరుపై ఆందోళ‌న‌కు సిద్ధ‌మైన సీపీఐ(ఎం) నాయ‌కుల‌ను అరెస్ట్ చేశారు. దీంతో ఓ వైపు రైతులు..మ‌రొక వైపు ప్ర‌జాప్ర‌తినిధులు, ఇటు సీపీఐ(ఎం) నాయ‌కులు తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఏడేండ్ల క్రితం నాసిన్ సంస్థ‌కు భూములు ఇస్తే.. ఇప్ప‌టివ‌ర‌కు స‌రైన ప‌రిహారం ఇవ్వ‌క‌పోగా.. రైతుల‌ను అరెస్ట్ చేస్తారా అంటూ సీపీఐ(ఎం) నాయ‌కులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Also Read :  యుద్దం ఆపేసిన రష్యా.. అందుకోస‌మేనా..?