Home » 2022 లో టీమిండియా ఏం కోల్పోయింది ? ఏం సాధించింది..? 

2022 లో టీమిండియా ఏం కోల్పోయింది ? ఏం సాధించింది..? 

by Anji
Ad

ప్రతీ ఏడాది లాగే ఈ ఏడాది కూడా  టీమిండియా క్రికెట్ లో కొన్ని రికార్డులు, మరికొన్ని చెత్త రికార్డులు నమోదయ్యాయి. ముఖ్యంగా 2021 మాదిరిగానే 2022 కూడా చరిత్రలో నిలిచిపోయింది. ఎన్నో జ్ఞాపకాలను మనతో వదిలేసి వెళ్లపోయింది. క్రికెట్ ను ఓ మతంలా భావించే భారతీయ క్రికెట్ అభిమానులకు 2022 ఎలాంటి జ్ఞాపకాలను అందించిందో ఒకసారి రివైండ్ చేసుకుంటూ టీమిండియా కు కలిసొచ్చిందా ? రాలేదా ? అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

టెస్ట్ సిరీస్ 2-0 తో క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా 2022ను విజయంతోనే ముగించింది. 2022లో టీమిండియా అన్ని ఫార్మాట్ లలో కలిపి మొత్తానికి 71 మ్యాచ్ లను ఆడింది. వాటిలో 46 మ్యాచ్ లలో భారత్ విజయం సాధించింది. 21 మ్యాచ్ లలో ఓడింది. 3 మ్యాచ్ లలో ఫలితం ఎటు తేలలేదు. మొత్తం మీద 64.78 విన్నింగ్స్ పర్సంటేజ్ సాధించింది. ఓ మ్యాచ్ టైగా ముగిసింది. అదేవిధంగా 71లో 25 స్వదేశంలో, మిగిలిన మ్యాచ్ లు అన్ని ఇండియా బయట జరిగాయి. 2022లో భారత జట్టు ప్రదర్శన అద్భుతంగా ఉందనే అంచనా వేయకండి. లోతుగా విశ్వేషించినట్టయితే 71 మ్యాచ్ లలో 7 టెస్ట్ మ్యాచ్ లు.. వాటిలో భారత జట్టు 4 గెలిచింది. 3 ఓడిపోయింది. నాలుగు విజయాలు భారత్ ని వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ నకు దగ్గ చేసింది. టెస్టుల్లో 57.14 విన్నింగ్ పర్సంటేజ్ తో భారత్. ఆ 71 మ్యాచ్ లలో 24 వన్డేలు ఉన్నాయి. అందులో 14 మ్యాచ్ ల్లో గెలిచిన జట్టు.. 8 మ్యాచ్ ల్లో మాత్రం ఓడిపోయింది. 2 మ్యాచ్ లు వర్షం కారణంగా రద్దయ్యాయి. దీంతో వన్డేలలో 58.33 విన్నింగ్ పర్సంటేజ్ సాధించింది. 2022లో టీమిండియా అత్యధిక మ్యాచ్ లు టీ-20 ఫార్మాట్ లో ఆడింది. మొత్తం 40 టీ-20 మ్యాచ్ లు ఆడిన టీమిండియా.. 28 విజయాలు, 10 ఓటమిలు, టై, ఒకటి ఫలితం తేలని మ్యాచ్ తో 70 శాతం విజయాలతో అద్భుతమైన ప్రదర్శన చేసినట్టు కనిపిస్తున్నా.. వాస్తవానికి 2022 టీమిండియాకి ఓ పీడకలలా గడిచింది.  

Also Read :  బిగ్ బాస్ సీజన్ 7 పై అదిరిపోయే అప్డేట్….హోస్ట్ గా మంచు విష్ణు….?

Manam News

 2022 జనవరి 03న సౌతాఫ్రికాతో టెస్ట్ మ్యాచ్ తో వేట ప్రారంభించిన భారత జట్టు ఆ సిరీస్ కోల్పోయింది. ఇక ఆ తరువాత సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్ లో 0-3తో ఓడిపోయింది. ఆ తరువాత స్వదేశంలో వెస్టిండీస్ తో మూడు వన్డేలు, మూడు టీ–20ల సిరీస్ లను క్లీన్ స్వీప్ చేసింది. వెంటనే శ్రీలంకను సైతం మూడు టీ-20 సిరీస్ లను క్లీన్ స్వీప్ చేసింది. వెంటనే శ్రీలంకను సైతం మూడు టీ-20లు, రెండు టెస్ట్ లలో వైట్ వాష్ చేసింది. ఆ రెండు చిన్న జట్టులే. జూన్ లో భారత్ కి వచ్చిన సౌత్ ఆఫ్రికా తో 5 టీ20ల సిరీస్ తో భారత్ ఆడిన ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అవ్వడతో 2-2తో కప్ ను పంచుకుంది. జులైలో ఐర్లాండ్ పర్యటనకు వెళ్లిన యంగ్ టీమిండియా రెండో టీ-20లో ఐర్లాండ్ ని ఓడించింది. ఇంగ్లండ్ తో జరిగిన రీ షెడ్యూల్డ్ టెస్ట్ లో మాత్రం ఓడిపోయింది. టీ-20, వన్డే సిరీస్ లను 2-1తేడాతో గెలిచింది. ఇంగ్లండ్ పర్యటన తరువాత విండీస్ టూర్ కి వెళ్లిన భారత్.. మూడు వన్డేల సిరీస్ ని క్లీన్ స్వీప్ చేసి 3 టీ-20 సిరీస్ ని గెలిచింది. వెంటనే మరో రెండు టీ-20లు వెస్టిండీస్ పై గెలిచింది. ఆగస్టులో పసికూన జింబాబ్వే వన్డే సిరీస్ ని 3-0తో క్లీన్ స్వీప్ చేసింది.  

Advertisement

Also Read :  సివిల్స్ క్లియర్ చేసిన టీమిండియా క్రికెటర్ గురించి మీకు తెలుసా ?

యూఏఈ వేదికగా జరిగిన ఆసియా కప్ 2022లో హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగింది భారత్. గ్రూప్ స్టేజ్ లోనే ఇంటికి వచ్చి.. ఆ టోర్నీలో మొత్తం 5 మ్యాచ్ లు ఆడగా.. 3 గెలిచి రెండు ఓడిపోయింది. ఆసియా కప్ లో విఫలమైన టీమిండియా ప్రతిష్టాత్మక టీ-20 ప్రపంచ కప్ ని ముందు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో టీ-20 సిరీస్ లు ఆడింది. ఆస్ట్రేలియా పై 2-1తో సౌతాఫ్రికా టీ-20 వన్డే సిరీస్ లను 2-1తో గెలిచింది. ఈ సిరీస్ లను తరువాత టీ-20 ప్రపంచ కప్ వేట మధ్య విరాట్ కోహ్లీ తన విశ్వరూపంతో చిరకాల ప్రత్యర్థి అయినటువంటి పాకిస్తాన్ పై నరాలు తెగే ఉత్కంఠ విజయంతో ప్రారంభించింది. సూపర్ 12 మ్యాచ్ లలో 4 విజయాలతో సెమీస్ చేరినభారత్ ఇంగ్లండ్ చేతిలో ఓటమిపాలైంది. వరల్డ్ కప్ తరువాత యంగ్ టీమిండియా న్యూజిలాండ్ తో రెండు టీ–20 సిరీస్ లలో ఒక మ్యాచ్ టై కావడంతో.. 1-0తో గెలిచింది. వన్డే సిరీస్ మాత్రం 0-1 తేడాతో ఓడిపోయింది. తాజాగా బంగ్లాదేశ్ తో మూడు వన్డేలు, రెండు టెస్ట్ సిరీస్ పర్యటనకు బంగ్లాకు వెళ్లిన టీమిండియా అవమానకరంగా వన్డే సిరీస్ ని 1-2 తేడాతో కోల్పోయింది. టెస్ట్ సిరీస్ లో మాత్రం బంగ్లాను 2-0తో వైట్ వాష్ చేసింది.

టీమిండియా మ్యాచ్ ల పరంగా చూసినట్టయితే విన్నింగ్ పర్సంటేజ్ బాగానే ఉన్నప్పటికీ గెలిచిన మ్యాచ్ ల్లో ఎక్కువగా చిన్న జట్లపైనే గెలిచింది. ఇంగ్లండ్ ని ఇంగ్లండ్ లో వన్డే, టీ-20 సిరీస్ ఓడించడం తప్ప ఈ ఏడాది టీమిండియా సాధించింది ఏం లేదు. ప్రతిష్టాత్మక టీ-20 వరల్డ్ కప్ లో సెమీస్ లో ఇంగ్లండ్ చేతిలో ఏకంగా 10 వికెట్లతో తేడాతో ఓడిపోయి చెత్త రికార్డును మూటగట్టుకుంది. అదేవిధంగా ఆసియా కప్ లో కూడా విజయం సాధించలేకపోయింది. 2022లో ప్రతిష్టాత్మక ఆసియా కప్, టీ-20 ప్రపంచ కప్ లో విఫలం చెందింది. 2022లో టీమిండియాకి పాజిటివ్ ఏంటంటే.. సూర్య కుమార్ యాదవ్ అద్భుతమైన ఫామ్ లో ఉండడమనే చెప్పాలి. మొత్తానికి 2022 టీమిండియాకి అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. ఇక కొత్త ఏడాది 2023లో అయినా భారత జట్టుకి అంత శుభమే జరుగాలని కోరుకుందాం. 

Also Read :   ఫ్యాన్స్‌ కు షాక్‌..విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ !

Visitors Are Also Reading