Home » బిగ్ బాస్ సీజన్ 7 పై అదిరిపోయే అప్డేట్….హోస్ట్ గా మంచు విష్ణు….?

బిగ్ బాస్ సీజన్ 7 పై అదిరిపోయే అప్డేట్….హోస్ట్ గా మంచు విష్ణు….?

by AJAY
Ad

ఇటీవల బిగ్ బాస్ సీజన్ 6 ముగిసింది. ఈ సీజన్ లో విన్నర్ గా నిలిచి సింగర్ రేవంత్ ట్రోపి గెలుచుకున్నారు. దాంతో బిగ్ బాస్ సీజన్ 7 ఎప్పుడు మొదలవుతుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సీజన్ 7 కోసం నిర్వాహకులు కంటెస్టెంట్ ల వేట మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా హౌస్ లో అడుగు పెట్టబోతున్నారు అంటూ పలువురు సభ్యుల పేర్లు సైతం వినిపిస్తున్నాయి.

Advertisement

ఇదిలా ఉంటే బిగ్ బాస్ సీజన్ 6 హోస్ట్ నాగార్జునపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. కొన్ని సీజన్ ల నుండి నాగార్జున బిగ్ బాస్ కు హోస్ట్ గా చేస్తున్నారు. అయితే నాగార్జున హోస్టింగ్ కొంతమంది ప్రేక్షకులు బోర్ గా ఫీల్ అవుతున్నారు. మరోవైపు నాగార్జున కూడా సినిమాలపై దృష్టి పెట్టాలని బిగ్ బాస్ నుండి తప్పుకుంటున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా కొత్త హోస్ట్ ఇతడే అంటూ కొందరి పేర్లు సైతం వినిపిస్తున్నాయి.

Advertisement

కొద్దిరోజుల క్రితం బిగ్ బాస్ సీజన్ 7 కు కొత్త హోస్ట్ గా బాలకృష్ణ రాబోతున్నారు అంటూ వార్తలు వినిపించాయి. అంతేకాకుండా హీరో రానా పేరు కూడా వినిపించింది. రానా ఓ సర్జరీ వల్ల కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నాడని …ఇప్పుడు బుల్లితెరపై ద్వారా ప్రేక్షకులను అలరించేందుకు బిగ్ బాస్ హోస్ట్ గా చేయబోతున్నాడని వార్తలు వినిపించాయి.

ఇక తాజాగా మరో పేరు ఇతర పైకి వచ్చింది. మా అధ్యక్షుడు మంచు విష్ణు బిగ్ బాస్ సీజన్ 7 కు హోస్ట్ గా చేయబోతున్నారంటూ వార్తలు మొదలయ్యాయి. అంతేకాకుండా బిగ్ బాస్ టీమ్ మంచు విష్ణును సంప్రదించినట్టు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ వార్తలు నిజమైతే మంచు విష్ణు బిగ్ బాస్ హోస్ట్ గా చేసేందుకు ఒప్పుకుంటారా లేదా అన్నది చూడాలి.

Also read :భద్రినాథ్ సినిమా లేడీ విలన్ భర్త టాలీవుడ్ లో టాప్ విలన్ అన్న సంగతి తెలుసా…? ఆయన ఎవరంటే…?

Visitors Are Also Reading