Home » సివిల్స్ క్లియర్ చేసిన టీమిండియా క్రికెటర్ గురించి మీకు తెలుసా ?

సివిల్స్ క్లియర్ చేసిన టీమిండియా క్రికెటర్ గురించి మీకు తెలుసా ?

by Anji
Ad

భారతదేశంలో అత్యంత కఠిన పరీక్షగా సివిల్స్ ఎగ్జామ్ కి పేరుంది. ఈ పరీక్షకి దేశవ్యాప్తంగా యమా క్రేజ్ ఉంటుంది. జీవితంలో ఎంత మంచి స్థాయిలో ఉన్నా సరే సివిల్స్ ఇచ్చే కిక్కే వేరుగా ఉంటుంది. దేశానికి సేవ చేసే అవకాశం సివిల్స్ రూపంలో ఉండడంతో యువత అడుగులు సివిల్స్ వైపే ఉన్నాయి. ప్రతీ సంవత్సరం లక్షలాది మంది సివిల్స్ పరీక్ష రాస్తున్నారు. కానీ క్లియర్ చేసే వారి సంఖ్య కేవలం వందల్లో మాత్రమే ఉంటుంది. అంత క్రేజ్ ఉన్న యూపీఎస్సీ ఎగ్జామ్ ని ఓ టీమిండియా క్రికెట్ ప్లేయర్ చేశాడనే విషయం మీకు తెలుసా..? 

Advertisement

ఆటలో ఎక్కువ ఆసక్తి కనబరిస్తే చదువులో వెనుకబడిపోతారు అని అంటుంటారు. కానీ తప్పు అని ఆటతో సమానంగా చదువులో కూడా రాణించగలరని నిరూపించాడు ఈ క్రికెటర్. అతను ఎవ్వరో కాదండోయ్.. మాజీ క్రికెటర్ అమే ఖురేషియా. 1972లో మధ్యప్రదేశ్ లో జన్మించాడు. అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టక ముందే ఖురేసియా సివిల్స్ క్లియర్ చేసి రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ లో ఉన్నతాధికారిగా విధులు నిర్వహిస్తున్నాడు. కేవలం 17 ఏళ్ల వయస్సులోనే పస్ట్ క్లాస్ క్రికెట్ లో ఆరంగేట్రం చేశాడు అమే ఖురేషియా. తన చిన్నప్పటి నుంచే చదువులో చాలా చురుకుగా ఉండేవాడు. క్రికెటర్ గా మారకపోయి ఉంటే కచ్చితంగా ఐఏఎస్ అవ్వడానికి ప్రయత్నించేవాడినని.. ఖురేషియా పలు సందర్భాల్లో పేర్కొన్నాడు.

Advertisement

Also Read :  టాప్ 2లో టీమిండియా… ఆ ఒక్క సిరీస్ గెలిస్తే టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి! ఈసారి ఆస్ట్రేలియాతో…

know about former indian cricketer amay khurasiya, who cleared upsc exam before international debut: मिलिए उस भारतीय क्रिकेटर से जिसने इंटरनैशनल डेब्यू से पहले पास की IAS की परीक्षा ...

చదువును ఎప్పుడు నిర్లక్ష్యం చేయని ఖురేషియా ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడుతూనే మధ్యప్రదేశ్ నుంచి సివిల్స్ ఎగ్జామ్ ని క్లియర్ చేశాడు. అతను సివిల్స్ క్లియర్ చేసిన కొద్ది రోజులకే జాతీయ జట్టు నుంచి ఆహ్వానం వచ్చింది. దేశం కోసం ఆడాలి అన్న కల నిజం కావడంతో ఖురేషియా చాలా సంతోషపడిపోయాడు. అలా 1999లో పెప్సీ కప్ లో భాగంగా శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా ఖురేషియా ఆరంగేట్రం చేసాడు. ఆ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ (45 బంతుల్లో 57 పరుగులు) చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. అదే ఫామ్ ని కంటిన్యూ చేయలేకపోయాడు. దీంతో అప్పటికే సివిల్స్ క్లియర్ చేయడంతో ఆటకు దూరమై.. సివిల్స్ తో దేశానికి సేవ చేస్తున్నాడు. భారత్ తరపున 12 వన్డేలు ఆడిన ఖురేషియా 149 పరుగులు చేసాడు. ఖురేషియా చివరి మ్యాచ్, ఫస్ట్ మ్యాచ్ రెండూ శ్రీలంతోనే ఆడడం విశేషం. మధ్యప్రదేశ్ తరపున 119 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడిన ఖురేషియా 7వేలకు పైగా పరుగులు చేశాడు. ఏప్రిల్ 22, 2007న ఫస్ట్ క్లాస్ క్రికెట్ తో పాటు అంతర్జాతీయ క్రికెట్ కి రిటైర్ మెంట్ ప్రకటించాడు. 

Also Read :  Unstoppable With NBK 2 : పవన్ ను విమర్శించే వాళ్ళు ఊర కుక్కలతో సమానం..బాలయ్య సంచలనం

Visitors Are Also Reading